Share News

జగతి ప్రగతి కోసం

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:42 AM

సామాన్య ప్రజల కోసం ప్రభువు ఎన్నో బోధనలు చేశాడు. ఆయన ప్రసంగాలు కొత్త కొత్త భాష్యాలతో, నూతన వివరణలతో సాగాయి. పాత నిబంధనలోని పది ఆజ్ఞల అమృతాన్ని జనావళికి పంచాయి. నాటి...

జగతి ప్రగతి కోసం

దైవమార్గం

సామాన్య ప్రజల కోసం ప్రభువు ఎన్నో బోధనలు చేశాడు. ఆయన ప్రసంగాలు కొత్త కొత్త భాష్యాలతో, నూతన వివరణలతో సాగాయి. పాత నిబంధనలోని పది ఆజ్ఞల అమృతాన్ని జనావళికి పంచాయి. నాటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనాచారాలను, అన్యాయాలను చూసి ప్రభువు స్పందించాడు. సందర్భాలకు తగిన విధంగా ఆయన బోధనలు సాగాయి. అవి కొన్నిసార్లు మాటల రూపంలో వెలువడ్డాయి. మరికొన్నిసార్లు తన ఆచరణ ద్వారా ప్రజలకు ఆయన చూపించాడు. సమాంతరంగా సాగిన రెండూ జగతి ప్రగతికి దోహదం చేశాయి. లోకంలోని చీకటిని ఆయన కళ్ళారా చూశాడు. ఆయన వాక్కులు ఆ చీకటిని తొలగించే వెలుతురు కిరణాలయ్యాయి.

ఎన్నో తప్పులు చేసి, ‘ఇక జీవించడం వ్యర్థం’ అని నిరాశతో కుంగిపోయేవారిని ప్రభువు చూశాడు. పరులతో నిందలు పడుతున్న వారిని చూశాడు. బలవంతుల అణచివేతకు గురవుతున్నవారిని చూశాడు. జీవితలక్ష్యం ఏమిటో తెలియక, ఎందుకు బతుకుతున్నామో, ఎవరికోసం బతుకుతున్నామో తెలియని అమాయకులను కూడా చూశాడు. వారి దగ్గరకు వెళ్ళాడు. కావలసినంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన పిలుపు అందరినీ చల్లగా పలకరించింది. దుఃఖితులను ఓదార్చింది. బాధితులు అయినప్పటికీ నీతిగా బతికేవారికీ, ధర్మం కోసం హింసను భరిస్తున్నవారికీ ఊరటనిచ్చింది. హృదయ శుద్ధితోనే మీ జన్మ ధన్యం అవుతుందనీ, ఆహారంలో ఉప్పులా విలువైన జీవితంతో, వెలిగించిన దివ్వెల్లా దారిచూపే బతుకులతో లోకానికి ఆదర్శంగా ఉంటూ దేవుణ్ణి మెప్పించాలని చెప్పాడు. అర్థరహితమైన మూఢనమ్మకాలను ఖండించాడు. శత్రుభావాన్ని తుంచుకోవాలని, ప్రేమభావాన్ని పెంచుకోవాలని, అప్పుడే మీరు చేసే పనికి దేవుడు ఆనందిస్తాడని, కాబట్టి శత్రువును ద్వేషించకుండా ప్రేమించాలని సందేశం ఇచ్చాడు. సత్యం, దయ, అహింస, ప్రేమ, విశ్వాసం, పశ్చాత్తాపం, క్షమ, ప్రార్థన లాంటి పదాలకు అసలైన అర్థాలు చెప్పాడు. దైవారాధన, సాటి మానవుల పట్ల ప్రేమ... ఈ రెండూ సమతూకంతో సాగాలని కొండ కోనల్లో తనచుట్టూ గుమిగూడిన ప్రజానీకానికి సరికొత్త వివరణ ఇచ్చాడు. ప్రజలకు తన బాటలో సాగే మనోధైర్యాన్ని అందించాడు. ఆయన బోధలు విశ్వమానవ ప్రేమ సూత్రాలు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 03:42 AM