Share News

డేరింగ్‌ డంగరీ

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:22 AM

సౌకర్యవంతమైన, ఆధునికమైన దుస్తులు కచ్చితంగా ఆదరణ పొందుతాయనడానికి ‘డంగరీ’ ఒక ఉదాహరణ. వస్త్రం పేరే దుస్తుల పేరుగా...

డేరింగ్‌ డంగరీ

ఫ్యాషన్‌

సౌకర్యవంతమైన, ఆధునికమైన దుస్తులు కచ్చితంగా ఆదరణ పొందుతాయనడానికి ‘డంగరీ’ ఒక ఉదాహరణ. వస్త్రం పేరే దుస్తుల పేరుగా స్థిరపడిపోయిన డంగరీలను అన్ని వయసుల మహిళలూ ఇష్టంగా ఎంచుకుంటూ ఉంటారు. వీటినెలా ఎంచుకోవాలో, దేంతో మ్యాచ్‌ చేయాలో తెలుసుకుందాం!

ఫుట్‌వేర్‌ ఇలా..

హీల్స్‌, ట్రైనర్స్‌, స్లైడర్స్‌, బ్లాక్‌ హీల్స్‌, బూట్స్‌... ఇలా పలు రకాల ఫుట్‌వేర్‌ డంగరీలకు సూటవుతాయి. నలుపు రంగు బ్లేజర్‌, హైహీల్స్‌ అద్భుతమైన మ్యాచింగ్‌. హెమ్స్‌ను రోల్‌ చేసి, ట్రైనర్‌, లెదర్‌ జాకెట్‌ కలిపి ధరిస్తే స్టైలి్‌షగా కనిపిస్తారు. బూట్స్‌, లాంగ్‌ కోట్స్‌ కూడా డంగరీలతో మ్యాచ్‌ చేయొచ్చు.

మ్యాచింగ్‌ మ్యాచింగ్‌

మరింత ఆధునికంగా కనిపించాలనుకుంటే, బందనా లేదా క్యాప్‌తో డంగరీలను మ్యాచ్‌ చేయాలి. మీ లుక్‌ మరింత ప్రత్యేకంగా ఉండాలనుకుంటే, రెండింట్లో ఒక బ్రేస్‌ను వదిలేయవచ్చు. అలాగే యాంకిల్‌ లెంగ్త్‌ ట్రౌజర్స్‌ కలిగిన డంగరీలను ఎంచుకోవచ్చు. లేదా యాంకిల్‌ బూట్స్‌, ట్రైనర్స్‌ కనిపించేలా ట్రౌజర్‌ను మడుచుకోవచ్చు. సాధారణంగా డంగరీలను క్రాప్‌ టాప్‌తో కలిపి ధరిస్తారు. వెరైటీ కోరుకునే వారు ఓవర్‌కోట్‌ లేదా బైకర్‌ జాకెట్‌ వేసుకోవచ్చు.

యాక్సెసరీస్‌ పెద్ద డయల్‌ వాచ్‌,

ఆక్సిడైజ్‌డ్‌ సిల్వర్‌ జువెలరీ డంగరీలకు మ్యాచ్‌ అవుతాయి. అయితే ఈ ఆభరణాలు వీలైనంత సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. స్టేట్‌మెంట్‌ ఫింగర్‌ రింగ్స్‌, కడాలు డంగరీలకు బాగుంటాయి.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 05:22 AM