వెలుతురుతో మాయ చేయండి
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:56 AM
ఇల్లు అంటే నాలుగు గోడల మధ్య ఉండే స్థలం మాత్రమే కాదు. అది మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక గూడు. ఇంటిని...
ఇల్లు అంటే నాలుగు గోడల మధ్య ఉండే స్థలం మాత్రమే కాదు. అది మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక గూడు. ఇంటిని అందంగా మార్చుకోవడానికి సోఫాలు, ఖరీదైన పెయింటింగులు మాత్రమే ఉంటే సరిపోదు. మనం ఎంచుకునే వెలుతురు, గదిలో పరిమళించే సువాసన ఆ ఇంటికి ప్రాణం పోస్తాయి.
వార్మ్‌లైటింగ్: పగలు సహజమైన సూర్యరశ్మి ఇంట్లో పడేలా చూసుకోవాలి. సాయత్రం వేళల్లో తెల్లని కాంతి కంటే వార్మ్ వైట్ (గోల్డెన్ యెల్లో) లైట్లు వాడితే ఇల్లు విలాసవంతంగా, హాయిగా కనిపిస్తుంది.
లేయర్డ్ లైటింగ్: గది మూలల్లో ఉండే కార్నర్ ల్యాంప్స్, టేబుల్ ల్యాంప్స్ గదికి లోతును ఇస్తాయి. అద్దాల వెనుక లేదా షెల్ఫ్‌లలో వాడే ‘స్ట్రిప్ లైట్స్’ ఆధునిక లుక్ ఇస్తాయి.
క్యాండిల్స్, ఫెయిరీ లైట్స్: గ్లాస్ జార్లలో చిన్నచిన్న ఫెయిరీ లైట్లు పెట్టి మూలల్లో ఉంచితే రాత్రిపూట ఇల్లు మాయాలోకంలా మారుతుంది.
పరిమళాలలో ప్రశాంతత
మనం ఇంట్లోకి అడుగుపెట్టగానే వచ్చే సువాసన మన మూడ్‌ను సెట్ చేస్తుంది. అందుకే సువాసన అనేది అలంకరణ మాత్రమే కాదు, అదొక థెరపీ.
ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్స్: లావెండర్, జాస్మిన్ లేదా లెమన్‌గ్రాస్ వంటి ఆయిల్స్ వాడితే మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఇవి గదిలో ఉన్న బ్యాక్టీరియాను కూడా నిరోధిస్తాయి.
సెంటెడ్ క్యాండిల్స్: డిజైనర్ క్యాండిల్స్ వెలుగుతోపాటు మధురమైన సువాసనలు వెదజల్లుతాయి. డిన్నర్ టేబుల్ వద్ద వీటిని ఉంచితే ఆ అనుభూతే వేరు.
నేచురల్ ఫ్లవర్స్: ఖరీదైన స్ర్పేల కంటే తాజా పూలగుత్తిని వాజులో అమర్చడం వల్ల సహజమైన సువాసనతోపాటు కంటికి అందంగా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..
సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు
Read Latest Telangana News And AP News