Share News

కలర్‌ఫుల్‌ క్రిస్టల్స్‌

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:55 AM

తళతళ మెరిసే క్రిస్టల్‌ జ్యువెలరీకి సర్వత్రా ఆదరణ పెరుగుతోంది. భిన్నమైన రంగులు, వినూత్నమైన డిజైన్లలో రూపొందే ఈ జ్యువెలరీ గురించిన మరిన్ని...

కలర్‌ఫుల్‌ క్రిస్టల్స్‌

ఫ్యాషన్‌

తళతళ మెరిసే క్రిస్టల్‌ జ్యువెలరీకి సర్వత్రా ఆదరణ పెరుగుతోంది. భిన్నమైన రంగులు, వినూత్నమైన డిజైన్లలో రూపొందే ఈ జ్యువెలరీ గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు...

బంగారం ధర కొండెక్కి కూర్చుంది. అలాగని ఆభరణాల జోలికి వెళ్లకుండా ఉండలేం కదా! అందుబాటు ధరల్లో ఆకట్టుకునే జ్యువెలరీ కోసం వెతుక్కుంటాం. ఆ కోవకి చెందినదే క్రిస్టల్‌ జ్యువెలరీ! సహజసిద్ధ క్వార్జ్ట్‌ క్రిస్టల్స్‌, జెమ్‌స్టోన్స్‌ లేదా హై క్వాలిటీ లెడ్‌ జోడించిన గాజుతో క్రిస్టల్‌ జ్యువెలరీ తయారుచేస్తారు. వజ్రాలకు బదులుగా అదే మెరుపుతో అత్యంత తక్కువ ధరలో దొరికే క్రిస్టల్‌ ఆభరణాలు పలు రంగుల్లో, రూపాల్లో దొరుకుతూ ఉంటాయి.

డైలీ వేర్‌గా...

భారీ క్రిస్టల్‌ ఆభరణాలు వేడుకలకు బాగుంటాయి. అలాగే వీటిలో డైలీ వేర్‌ జ్యువెలరీ కూడా ఉంటాయి. సన్నని రోల్డ్‌గోల్డ్‌ చైన్‌కు క్రిస్టల్‌ లాకెట్‌ జోడించి, అవే క్రిస్టల్స్‌తో కూడిన స్టడ్స్‌ను డైలీ వేర్‌గా ఎంచుకోవచ్చు. లేదంటే చిన్న సైజు క్రిస్టల్స్‌తో తయారైన నాజూకు నెక్లెస్‌ సెట్‌ను ఎంచుకోవచ్చు.

పలు రకాల రంగుల్లో...

క్రిస్టల్స్‌ అన్ని రంగుల్లో రూపొందుతూ ఉంటాయి. కాబట్టి దుస్తులకు మ్యాచ్‌ అయ్యే హారాల సెట్‌ను ఎంచుకోవచ్చు. ప్రత్యేకించి, గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు క్రిస్టల్స్‌ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. ఒకే రకమైన క్రిస్టల్‌ హారాలు ఎంచుకోవచ్చు లేదా మల్టీ కలర్‌ క్రిస్టల్‌ హారాలను కూడా ఎంచుకోవచ్చు. దేన్ని ఎంచుకున్నా దుస్తులకు చక్కగా మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి.

భిన్నమైన రూపాల్లో...

నెక్లెస్‌, బ్రేస్‌లెట్‌, లాంగ్‌ చైన్‌... ఇలా క్రిస్టల్స్‌తో పలు రకాల ఆభరణాలు రూపొందుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి నచ్చిన నగ ఎంచుకోవచ్చు. బంగారాన్ని తలపించే గోల్డ్‌ కలర్‌ బీడ్స్‌తో కలిపి అల్లుకునే క్రిస్టల్‌ హారాలు సంప్రదాయ వస్త్రధారణకు చక్కగా సూటవుతాయి. భారీ లాకెట్‌తో కూడిన లేయర్‌ క్రిస్టల్‌ హారాల సెట్స్‌, పెళ్లిళ్లు, పండుగ వేడుకల్లో అందర్నీ ఆకట్టుకుంటాయి. కాబట్టి ఒకటికి మించిన వరుసల హారాలు, లావుపాటి క్రిస్టల్‌ నెక్లెస్‌లను వేడుకలకు పరిమితం చేయాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 01:55 AM