Share News

‘కో ఆర్డ్‌ సెట్‌’తో కంఫర్ట్‌గా

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:08 AM

నేటి యువతులు.. ఫ్యాషన్‌, స్టయిల్‌తోపాటు కంఫర్ట్‌కూ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కోవలోనే ‘కో ఆర్డ్‌ సెట్‌’లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఒకే ఫ్యాబ్రిక్‌తో టాప్‌, బాటమ్‌లను తీర్చిదిద్ది ...

‘కో ఆర్డ్‌ సెట్‌’తో కంఫర్ట్‌గా

ఫ్యాషన్‌

నేటి యువతులు.. ఫ్యాషన్‌, స్టయిల్‌తోపాటు కంఫర్ట్‌కూ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కోవలోనే ‘కో ఆర్డ్‌ సెట్‌’లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఒకే ఫ్యాబ్రిక్‌తో టాప్‌, బాటమ్‌లను తీర్చిదిద్ది ఈ డ్రెస్‌లను రూపొందిస్తారు. వెస్ట్రన్‌, ఇండో వెస్ట్రన్‌, ఎత్నిక్‌ డిజైన్లలో ఎన్నో రకాల కో ఆర్డ్‌ సెట్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాలేజీలు, ఆఫీసులు, షాపింగ్‌లు, టూర్లకు వెళ్లేటప్పుడు మహిళలు, యువతులు ఎక్కువగా ఈ డ్రెస్‌లనే ఎంపిక చేసుకుంటున్నారు.

కో ఆర్డ్‌ సెట్‌ డ్రెస్‌ డిజైన్లు సాధారణంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా కాటన్‌, లినెన్‌, శాటిన్‌, వెల్వెట్‌ ఫ్యాబ్రిక్‌లతో రూపొందిస్తుంటారు. పోల్కా డాట్స్‌, ఫ్లోరల్‌ ప్రింట్స్‌, కాలర్‌ నెక్‌లు, డీప్‌ వి నెక్‌లు, ఫుల్‌ హ్యాండ్స్‌, అందమైన బటన్లు, బెల్టులు, ఎంబ్రాయిడరీ వర్క్‌లు, జిప్‌లు జతచేసిన స్టయిలిష్‌ కో ఆర్డ్‌లను యువతులు చిన్నపాటి పార్టీల్లో ధరించడానికి ఇష్టపడుతున్నారు. వీటికి మ్యాచ్‌ అయ్యేలా షూస్‌, శాండల్స్‌, బ్యాగ్స్‌, జ్యువెలరీ, సన్‌ గ్లాసెస్‌ ధరించి మోడరన్‌గా మెరిసిపోతున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మోడల్స్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ కో ఆర్డ్‌ సెట్‌లతోనే కనిపిస్తున్నారు. ప్యాంట్‌- టాప్‌, షార్ట్స్‌- షర్ట్‌, క్రాప్‌ టాప్‌- ప్లాజో లాంటి వెరైటీ స్టయిల్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

వైబ్రెంట్‌ ప్రింట్లు, బ్రీజీ సిల్హౌట్లు, పాస్టెల్‌ డిజైన్స్‌తో రూపొందించిన ట్రెండీ కో ఆర్డ్‌ సెట్లు... వేసవికాలంలో ధరించడానికి బాగుంటాయి. వీటిని సమ్మర్‌ ట్రిప్స్‌, ఈవెనింగ్‌ ఈవెంట్లకు స్టయిలిష్‌ ఎంపికగా చెప్పవచ్చు. అంతేకాదు వార్డ్‌రోబ్‌లోని ఇతర స్టేపుల్స్‌తో జతచేసి సరికొత్త ఫ్యాషన్‌ లుక్‌ కోసం ప్రయత్నించవచ్చు. వీటిని ధరించడం, ఉతకడం, మెయింటైన్‌ చేయడం చాలా సులువు. రోజంతా వేసుకుని ఉన్నప్పటికీ ముడుతలు పడవు. ప్రయాణాలప్పుడు నలగవు. కాస్త వదులుగా, మృదువుగా ఉంటూ ఏ సందర్భంలోనైనా ధరించడానికి అనుకూలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:08 AM