కనువిందైన క్యాజువల్ వేర్
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:47 AM
క్షణాల్లో రెడీ అయిపోవాలనుకుంటే క్యాజువల్ వేర్ ఎంచుకోవాలి. అందుకు తగినవే కొ ఆర్డ్ సెట్స్. షాపింగ్‌కూ, సినిమాలకూ ఇవిగో ఇలాంటి క్యాజువల్ వేర్ ఎంతో సౌకర్యంగా ఉంటాయి...
ఫ్యాషన్
క్షణాల్లో రెడీ అయిపోవాలనుకుంటే క్యాజువల్ వేర్ ఎంచుకోవాలి. అందుకు తగినవే కొ ఆర్డ్ సెట్స్. షాపింగ్‌కూ, సినిమాలకూ ఇవిగో ఇలాంటి క్యాజువల్ వేర్ ఎంతో సౌకర్యంగా ఉంటాయి.
రంగురంగుల ప్రింట్లు, ఆకట్టుకునే డిజైన్లు, విభిన్నమైన ఫ్యాబ్రిక్స్‌తో రూపొందే క్యాజువల్ వేర్‌లో ఎంచుకోడానికి అనేక వెరైటీలు ఉంటాయి. మరీ ముఖ్యంగా టాప్, బాటమ్‌తో కూడిన కొ ఆర్డ్ సెట్స్ క్లోజెట్‌లో ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. జిగేలుమనిపించే పార్టీ వేర్, హెవీ వర్క్, లేదా ఎంబ్రాయిడరీ డ్రస్‌లు, అన్ని సందర్భాలకూ సూట్ కావు. కాబట్టి స్నేహితులతో సినిమాలు, షికార్లకు వెళ్లేటప్పుడు క్యాజువల్ వేర్‌నే ఎంచుకోవాలి.
కాటన్ లేదా రేయాన్
కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. వాటిలో చెప్పుకోదగినవి కాటన్, రేయాన్. వీటితో రూపొందే కొ ఆర్డ్ సెట్స్ మెత్తగా, సౌకర్యంగా ఉంటాయి. అన్ని రకాల రంగులు, అందమైన ప్రింట్లలో దొరికే ఈ ఫ్యాబ్రిక్స్‌తో డిజైన్ చేసిన కొ ఆర్డ్ సెట్స్ ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి.
యాక్సెసరీస్
కొల్హాపురి చెప్పులు లేదా ఫ్లాట్స్ క్యాజువల్ వేర్‌కు చక్కగా సూటవుతాయి. చేతికి వాచ్, సింపుల్ జ్యువెలరీ ఈ దుస్తులకు చాలా బాగా నప్పుతాయి.
టాప్ అండ్ బాటమ్
నచ్చిన ఫ్యాబ్రిక్ ఎంచుకుని స్వయంగా డిజైన్ చేసుకోవాలనుకుంటే, స్లీవ్‌లెస్ టాప్, క్యాప్రిని పోలిన ప్యాంట్ కుట్టించుకోవచ్చు. ప్యాంటుకు జేబులు, టాప్‌కు కాలర్లు కుట్టించుకుంటే మరింత ఫ్యాషన్‌గా కనిపిస్తారు. లాంగ్ స్లీవ్స్, మడుచుకోడానికి వీలుగా స్ట్రాప్స్ కుట్టించుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా