Share News

మత్స్యసంపదపైప్రాక్టికల్‌ అవగాహన పెంచే బీఎఫ్‌ఎస్సీ

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:48 AM

నీలి విప్లవంతో ఆక్వారంగానికి ప్రాధాన్యం పెరిగింది. అలాగే ఆహార రంగంలో మత్స్య ఉత్పత్తులు ఇతోధిక పాత్ర పోషిస్తున్నాయి. ప్రధానంగా మత్స్య అభివృద్ధి అధికారి(ఎ్‌ఫడీఓ) పోస్టులకు ప్రభుత్వం

మత్స్యసంపదపైప్రాక్టికల్‌ అవగాహన పెంచే బీఎఫ్‌ఎస్సీ

మత్స్యసంపదపైప్రాక్టికల్‌ అవగాహన పెంచే బీఎఫ్‌ఎస్సీ

నీలి విప్లవంతో ఆక్వారంగానికి ప్రాధాన్యం పెరిగింది. అలాగే ఆహార రంగంలో మత్స్య ఉత్పత్తులు ఇతోధిక పాత్ర పోషిస్తున్నాయి. ప్రధానంగా మత్స్య అభివృద్ధి అధికారి(ఎ్‌ఫడీఓ) పోస్టులకు ప్రభుత్వం బీఎఫ్‌ఎస్సీ కోర్సును కనీస అర్హతగా నిర్ణయించింది. ప్రైవేటు రంగంలోనూ బీఎ్‌ఫఎస్సీ ఉత్తీర్ణులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ కోర్సులో చేరే అమ్మాయిల సంఖ్య బాగా పెరిగింది. మా కళాశాల నుంచి ఇప్పటివరకు 720 మంది పైగా పట్టభద్రులయ్యారు. అందరూ వివిధ రంగాల్లో సిర్ధపడ్డారు.

- డాక్టర్‌ కె. ధనపాల్‌, అసోసియేట్‌ డీన్‌, ముత్తుకూరు మత్స్యకళాశాల

ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీరానికి తోడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చెరువుల్లో చేపల పెంపకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సంబంధిత వ్యవహారంలో ఎప్పటికప్పుడు ఆధునికతను జోడించడమే కాకుండా, మెరుగైన పద్ధతుల కోసం శాస్త్రీయంగా అధ్యయనం, శిక్షణకు ఉద్దేశించినవే మత్స్య కళాశాలలు. ఇవి అందించే ప్రాథమిక కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌(బీఎ్‌ఫఎస్సీ).

  • ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు కళాశాలల్లో ఈ కోర్సును అందిస్తున్నారు.

  • మత్స్యశాస్త్ర బోధన కోసం భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌)కి అనుబంధంగా 1992లో ముత్తుకూరు మండలం ఈపూరు వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి మత్స్యకళాశాలను ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 2022లో రెండో మత్స్యకళాశాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్‌ (బైపీసీ) పూర్తి చేసుకున్న విద్యార్ధులకు ఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు.

  • ముత్తుకూరు మత్స్యకళాశాలలో 40 మంది, నర్సాపురం మత్స్యకళాశాలలో 60 సీట్లు ఉన్నాయి. ఐసీఏఆర్‌ కింద మరో ఆరు సీట్లు ఉన్నాయి.

  • నాలుగేళ్ల బీఎ్‌ఫఎస్సీ కోర్సులో ఎనిమిది సెమిస్టర్‌లు ఉంటాయి. ఆరు సెమిస్టర్లలో మత్స్యరంగానికి సంబంధించిన వివిధ అంశాలను అభ్యసించాలి. చివరి ఏడాది రెండు సెమిస్టర్లలో కృషి అనుభవ పఽథకం(ఫివెప్‌), ఎక్స్‌పీరియన్షియల్‌ ఎర్నింగ్‌ ప్రోగ్రామ్‌(ఈఎల్‌పీ) కింద క్షేత్రస్థాయి పని చేయాలి.


  • ఆక్వాకల్చర్‌, ఆక్వాటిక్‌ ఏనిమల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఆక్వాటిక్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫిషరీస్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, ఫిషరీ ఇంజనీరింగ్‌, ఫిషరీస్‌ ఎక్స్‌టెన్షన్‌, ఫిషరీస్‌ ఎకానమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ఇంగ్లీష్‌, ఎన్‌ఎ్‌సఎస్‌, సీసీఏ తదితర అంశాలను ఈ కోర్సులో భాగంగా చదవాలి.

  • ఎంఎ్‌ఫఎస్సీలో ఆక్వాకల్చర్‌, ఆక్వాటిక్‌ ఏనిమల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఆక్వాటిక్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫిషరీస్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, ఫిషరీ ఇంజనీరింగ్‌ విభాగాలు ఉన్నాయి. ఆపై అదే విభాగంలో పీహెచ్‌డీ చేసేందుకు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష నిర్వహించి అవకాశం కల్పిస్తుంది.

  • ప్రభుత్వ రంగంలో ఫిషరీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు తోడు ఆక్వా రీసెర్చ్‌, అక్వా ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో అవకాశాలు ఉంటాయి. ప్రైవేటురంగంలోనూ జాబ్స్‌ ఉంటాయి.

తెలంగాణలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ కోర్సును పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం అందిస్తోంది. వనపర్తి జిల్లా పెబ్చేరులో ఫిషరీ సైన్స్‌ కళాశాల ఉంది. ఇందులో 25, ఈడబ్ల్యుఎస్‌ కోటా కింద 3 కలిపి 28సీట్లు ఉన్నాయి.

రాయసం సుమంత్‌,

ముత్తుకూరు

ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 13 , 2026 | 05:48 AM