రంగు రంగుల రెయిన్ కోట్స్
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:55 AM
రెయిన్ కోట్స్ కూడా ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తగ్గట్టు రూపొందు తున్నాయి. వాన నుంచి రక్షణ కల్పిస్తూనే ఆకట్టుకునే రంగుల్లో ఆకర్షణను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా మార్కెట్లో...
ఫ్యాషన్
రెయిన్ కోట్స్ కూడా ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తగ్గట్టు రూపొందు తున్నాయి. వాన నుంచి రక్షణ కల్పిస్తూనే ఆకట్టుకునే రంగుల్లో ఆకర్షణను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా మార్కెట్లో దొరుకుతున్న ఆ రెయిన్ కోట్స్ ఇవే!
రెయిన్ జాకెట్:
ఫ్యాషన్‌గా కనిపించాలనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ వాటర్‌ప్రూఫ్, హుడెడ్ రెయిన్ జాకెట్లు అనేక ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతాయి. ఇవి చల్లని గాలి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి కాబట్టి జలుబు, దగ్గు లాంటి రుగ్మతలు దరి చేరకుండా ఉంటాయి.
హుడెడ్ రెయిన్‌కోట్:
రెగ్యులర్ ఫిట్టింగ్ కలిగి ఉండే ఈ తరహా రెయిన్ కోట్ తేలికపాటి, భారీ రెండు రకాల వర్షాలకూ తగినట్టు రూపొందుతాయి.
పాలియెస్టర్ రెయిన్‌కోట్:
ప్రత్యేకమైన పాంచొ స్టైల్‌లో రూపొందే పాలియెస్టర్ రెయిన్ కోట్స్, పటిష్ఠమైన హుడీతో వాన నుంచి ముఖానికి రక్షణ కోసం అడ్జస్ట్ చేసుకోగలిగే డ్రా స్ర్టింగ్స్‌ను కలిగి ఉంటాయి.
వాటర్‌ప్రూఫ్ ఫుల్ రెయిన్‌కోట్:
షర్టు, ప్యాంట్‌ను పోలిన ఈ రెయిన్‌కోట్, తల నుంచి పాదాల వరకూ రక్షణ కల్పిస్తుంది. జీన్స్, శారీ.. ఇలాంటి ఏ డ్రస్ వేసుకున్నా, ఏమాత్రం తడవకుండా ఉండడం కోసం ఈ రెయిన్‌కోట్‌ను ఎంచుకోవచ్చు. ఈ రెయిన్‌కోట్‌కు డబుల్ లేయర్ ప్రొటెక్షన్‌తో పాటు రివర్సిబుల్ డిజైన్ ఉండేలా చూసుకుంటే, రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.
ట్రాన్స్‌పరెంట్ రెయిన్‌కోట్:
స్టైలిష్‌గా, ఎఫెక్టివ్‌గా ఉండే పారదర్శక రెయిన్‌కోట్ చూడడానికి కాస్త వెరైటీగా ఉంటుంది. ఇవి హ్యాండ్ బ్యాగ్ ఇమిడిపోయేంత చిన్నవిగా కూడా ఉంటాయి. త్వరగా ఆరిపోయే తత్వం కూడా కలిగి ఉంటాయి.
Also Read:
మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు