Share News

కలర్‌ఫుల్‌ కాటన్‌ ఫ్రాక్స్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:47 AM

వేసవి నెమ్మదిగా ప్రతాపాన్ని పెంచడం మొదలుపెట్టింది. కాబట్టి కాటన్‌ దుస్తుల కలెక్షన్‌ మొదలుపెట్టక తప్పదు. ఈ కాలంలో కాటన్‌ ఫ్రాక్స్‌ ఎంతో సౌకర్యంగా ఉంటాయి. జైపూర్‌ కాటన్‌, బగ్రు, కలంకారీ వస్త్రాలతో...

కలర్‌ఫుల్‌ కాటన్‌ ఫ్రాక్స్‌

ఫ్యాషన్‌

వేసవి నెమ్మదిగా ప్రతాపాన్ని పెంచడం మొదలుపెట్టింది. కాబట్టి కాటన్‌ దుస్తుల కలెక్షన్‌ మొదలుపెట్టక తప్పదు. ఈ కాలంలో కాటన్‌ ఫ్రాక్స్‌ ఎంతో సౌకర్యంగా ఉంటాయి. జైపూర్‌ కాటన్‌, బగ్రు, కలంకారీ వస్త్రాలతో ఇవిగో ఇలాంటి ఫ్రాక్స్‌ డిజైన్‌ చేయించుకోండి.

ప్రింటెడ్‌ కాటన్స్‌ ఈ కాలంలో ఎంతో సౌకర్యంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకోసం హ్యాండ్‌ బ్లాక్‌, లినెన్‌, బాగ్‌, మల్‌, బగ్రు, కాంతా, పిమా కాటన్‌ వస్త్రాలను ఎంచుకోవచ్చు. బజార్లో లెక్కలేనన్ని మోడల్స్‌లో రెడీమేడ్‌ ఫ్రాకులు దొరుకుతాయి. కానీ ఒంటికి అద్దినట్టు అందంగా కనిపించాలన్నా, ఎక్కువ కాలం మన్నాలన్నా స్వయంగా డిజైన్‌ చేయించుకోవాలి. సౌకర్యాన్ని బట్టి మోకాళ్ల వరకూ లేదా మోకాళ్ల కింది వరకూ ఫ్రాక్స్‌ కుట్టించుకోవచ్చు. మెడకు కాలర్‌, నడుమకు బెల్ట్‌తో దుస్తులకు మోడర్న్‌ లుక్‌ వస్తుంది. పొట్టి చేతులైనా, మోచేతుల వరకూ కుట్టించుకున్నా చూడముచ్చటగానే ఉంటుంది. ఫ్రాక్‌కు అదనపు హంగులు జోడించడం కోసం ఆకర్షణీయమైన బటన్స్‌ ఎంచుకోవచ్చు.

యాక్సెసరీస్‌ ఇలా...

  • బూట్స్‌, శాండిల్స్‌, లోఫర్స్‌... ఫ్రాకులకు ఎలాంటి పాదరక్షలైనా చాలా బాగా నప్పుతాయి

  • మెడలో హారాలు నప్పవు. కానీ లోనెక్‌ ఫ్రాక్‌ ధరించినప్పుడు మెడలో చైన్‌ వేసుకోవడం తప్పనిసరి

  • చేతికి వాచ్‌ అదనపు ఆకర్షణ తెచ్చిపెడుతుంది, కానీ ఆ వాచ్‌ కచ్చితంగా బోల్డ్‌గా ఉండాలి

  • కాటన్‌ ఫ్రాక్స్‌కు స్లింగ్‌ బ్యాగ్‌ చాలా బాగా సూటవుతుంది

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 05:47 AM