పెదవుల కోసం లిప్ టింట్స్
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:36 AM
వేసవిలో మిగతా సౌందర్య సాధనాలతో పాటు లిప్‌స్టిక్స్ కూడా మార్చుకోవాలి. ఈ కాలంలో చెక్కుచెదరని లిప్ మేకప్ కోసం లిప్ స్టిక్స్ బదులుగా, లిప్ టింట్స్ ఎంచుకోవాలి....
మేకప్
వేసవిలో మిగతా సౌందర్య సాధనాలతో పాటు లిప్‌స్టిక్స్ కూడా మార్చుకోవాలి. ఈ కాలంలో చెక్కుచెదరని లిప్ మేకప్ కోసం లిప్ స్టిక్స్ బదులుగా, లిప్ టింట్స్ ఎంచుకోవాలి.
వాటర్ లేదా జెల్ ఆధారిత లిప్ టింట్స్/లిప్ స్టెయిన్స్ వేసవికి అనువైనవి. వీటిని పెదవులకు అద్దుకోవడం కోసం డో ఫుట్ అప్లికేటర్ ఉపయోగించాలి. ఒకసారి పెదవుల మీద సెట్ అయితే రంగు తగ్గడం, పెదవులు దాటి విస్తరించడం లాంటి ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. పానీయాలు తాగినా, నీళ్లలో మునకలేసినా ఈ లిప్ టింట్స్ చెదిరిపోవు. తేలికపాటి టెక్స్‌చర్ వల్ల చమటకు చెదిరిపోకుండా ఉంటాయి. పైగా పెదవులకు లిప్‌స్టిక్ వేసుకున్న భావన కలగదు.
రంగులు: సహజసిద్ధ గులాబీరంగులు, బెర్రీ టోన్స్ వేసవికి తగిన రంగులు
బామ్: పెదవులకు బామ్ అప్లై చేసి ఆ తర్వాత టింట్స్ పూసుకుంటే, పెదవులు మరింత తేమగా ఉంటాయి
టిష్యూ: పెదవులకు అద్దుకున్న లిప్ టింట్ చెదరకపోయినా, ఎండలోకి వెళ్లినప్పుడు టిష్యూతో అద్దుకుంటూ ఉండడం వల్ల తాజాదనం కొనసాగుతుంది
గ్లాస్: పెదవులకు మరికాస్త మెరుపు జోడించాలనుకుంటే లిప్ గ్లాస్ కూడా అప్లై చేసుకోవచ్చు
ప్రెప్: లిప్‌స్టిక్ మాదిరిగానే లిప్ టింట్‌కు ముందు పెదవులను స్క్రబ్ చేసి సిద్ధం చేయాలి
తేమ: పెదవులు మరింత మృదువుగా, తేమగా ఉండడం కోసం మన్నికైన మాయిశ్చరైజర్‌ను అప్లై చేసి, ఆ తర్వాత లిప్ టింట్ వాడుకోవాలి
పార్టీ వేర్: ముదురు ఎరుపు, గోధుమ రంగు, మెరూన్ రంగులు ఈవినింగ్ పార్టీలకు బాగుంటాయి
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..