తేనెతో మచ్చలు మాయం
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:54 AM
తేనెతో చిన్న చిట్కాలు పాటించి మచ్చలు లేని ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే...
తేనెతో చిన్న చిట్కాలు పాటించి మచ్చలు లేని ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే...
చిన్న పళ్లెంలో పావు చెంచా పసుపు, చెంచా తేనె, ఒక చుక్క బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అయిదు నిమిషాలపాటు మెల్లగా మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే మొటిమల మచ్చలు, ఎండ వల్ల ఏర్పడే ట్యాన్ తొలగి ముఖం ఛాయగా మెరుస్తుంది.
ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు, చెంచా తేనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్ చేయాలి. అయిదు నిమిషాల తరువాత చేతి వేళ్లతో సున్నితంగా మర్దన చేస్తే చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. తరచూ ఇలా చేస్తుంటే మొటిమలు, బ్లాక్‌హెడ్స్, మచ్చలు మాయమై ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
అర కప్పు అరటిపండు గుజ్జులో రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మం మృదువుగా తాజాగా కనిపిస్తుంది.
రెండు చెంచాల తేనెలో పావు చెంచా గంధం పొడి, రెండు చెంచాల గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తుంటే చర్మం బిగుతుగా కాంతివంతంగా మారుతుంది.
చెంచా కలబంద గుజ్జులో చెంచా తేనె కలిపి రాత్రి పడుకునేముందు ముఖానికి పట్టించి ఉదయాన్నే మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు చేస్తే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు మాయమవుతాయి.
పావు కప్పు బొప్పాయి గుజ్జులో రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తేమతో నిండి ముఖం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్