Share News

అందాన్ని పెంచే తేనె

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:25 AM

తేనె ప్రకృతిసిద్దంగా లభించే మంచి మాయిశ్చరైజర్‌. దీనితో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం...

అందాన్ని పెంచే తేనె

తేనె ప్రకృతిసిద్దంగా లభించే మంచి మాయిశ్చరైజర్‌. దీనితో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం...

  • ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత బుగ్గలు, ముక్కు, నుదుటి భాగాల్లో పలుచగా తేనె రాసి పావుగంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆపైన మంచినీటితో శుభ్రం చేసుకుంటే చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. తేనె.. క్లెన్సర్‌లా పనిచేసి ముఖాన్ని ఛాయగా మెరిపిస్తుంది.

  • వారానికి రెండుసార్లు ముఖానికి మెడకు తేనెను అప్లయ్‌ చేసుకుంటూ ఉంటే చర్మం తేమతో నిండి బిగుతుగా మారుతుంది. ముఖంపై ఏర్పడే ముడుతలు, గీతలు మాయమవుతాయి.

  • ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఎక్కువగా ఉంటే వాటిమీద... చెంచా తేనెలో రెండు చుక్కల నిమ్మరసం లేదంటే చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని రాయాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండురోజులకోసారి చేస్తుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల తేనె, చెంచా చక్కెర వేసి కలపాలి. దీన్ని స్క్రబ్‌లా ముఖానికి పట్టించి చూపుడు వేలితో సున్నితంగా మర్దన చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే.. ముఖంపై పేరుకున్న మృతకణాలు, మురికి తొలగిపోతాయి. చర్మం తాజాగా కాంతివంతంగా మారుతుంది.

  • రాత్రి పడుకునేముందు పెదవులపై కొద్దిగా తేనెను అప్లయ్‌ చేస్తే అవి పొడిబారకుండా మృదువుగా ఉంటాయి.

  • రెండు చెంచాల తేనెలో చెంచా పెరుగు లేదా కలబంద గుజ్జు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ఎండ వల్ల కలిగే ట్యాన్‌ తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి..

రాజీనామా దిశగా నితీశ్ కుమార్.. రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం

మాది పాలు.. తేనె సంబంధం

Updated Date - Mar 05 , 2026 | 04:25 AM