Share News

సన్‌స్క్రీన్ రాసుకుంటున్నారా..?

ABN , Publish Date - Mar 30 , 2026 | 03:29 AM

బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి, చేతులకు సన్‌స్క్రీన్ రాసినప్పటికీ ట్యానింగ్‌ సమస్య వేధిస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వాటి...

సన్‌స్క్రీన్ రాసుకుంటున్నారా..?

బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి, చేతులకు సన్‌స్క్రీన్ రాసినప్పటికీ ట్యానింగ్‌ సమస్య వేధిస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వాటి గురించి తెలుసుకుందాం...

  • ముందుగా సన్‌స్క్రీన్ ను సరిగా అప్లయ్‌ చేస్తున్నారా లేదా అనేది పరిశీలించుకోవాలి. సన్‌స్ర్కీన్‌ను చూపుడువేలిమీద కొద్దిగా తీసుకుని ముఖానికి రాసేస్తే సరిపోదు. రెండు వేళ్ల పొడవునా క్రీమ్‌ను తీసుకుని ఆ మొత్తాన్ని ముఖానికి నెమ్మదిగా పట్టించాలి. పావు చెంచా కంటే తక్కువ మొత్తాన్ని రాస్తే అది సరిపోక ముఖం నల్లబడుతుంది. అలాగే చేతులకు, చెవులకు, మెడ భాగాలకు, నుదుటి అంచులకు కూడా తగిన పరిమాణంలో సన్‌స్ర్కీన్‌ను అప్లయ్‌ చేయాలి.

  • బయటికి వెళ్లడానికి పావు గంట ముందే సన్‌స్ర్కీన్‌ను అప్లయ్‌ చేసుకోవాలి. అప్పుడే చర్మంపై ఓ రక్షిత పొర ఏర్పడుతుంది. రోజుకు ఒకసారి రాసుకుంటే సరిపోదు. ఎండలో ఎక్కువసేపు గడపాల్సి వస్తే కనీసం రెండు గంటలకు ఒకసారి సన్‌స్ర్కీన్‌ రాసుకుంటూ ఉండాలి.

  • సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ (ఎస్‌పీఎఫ్‌) కనీసం 30 ఉండే సన్‌స్ర్కీన్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పించే బ్రాడ్‌ స్ర్పెక్ట్రమ్‌, పీఏ++ ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి.

  • సువాసనకు, ఆక్సీబెంజోన్‌కు ప్రాముఖ్యమివ్వకూడదు. చెమటకు కరిగిపోకుండా వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉన్నదాన్ని చర్మ తత్వానికి సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. మొటిమలు ఎక్కువగా ఉన్న వారు మాత్రం ఆయిల్‌ ఫ్రీ సన్‌స్ర్కీన్‌ను రాసుకోవడం మంచిది.

  • ముందుగా మాయిశ్చరైజర్‌ రాసుకుని ఆపైన సన్‌స్ర్కీన్‌ అప్లయ్‌ చేయాలి. కనీసం పది నిమిషాలు ఆగిన తరువాతనే ఫౌండేషన్‌ లేదా మేకప్‌ ప్రయత్నించాలి.

  • సన్‌స్ర్కీన్‌ స్ర్పేలు వాడేవారు నేరుగా స్ర్పే చేసుకోకూడదు. ముందుగా చేతుల్లోకి స్ర్పే చేసుకుని ఆపైన శరీర భాగాలకు పట్టించాలి.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 30 , 2026 | 03:29 AM