‘బ్యాగీ’ బహు బాగు
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:15 AM
స్కిన్నీ జీన్స్ స్థానాన్ని, బ్యాగీ జీన్స్ ఆక్రమించేశాయి. వైడ్ లెగ్, లూజ్ ఫిట్.. ఇలా పలు రకాల పేర్లతో ట్రెండ్ అవుతున్న బ్యాగీ జీన్స్ స్టైల్ ప్రస్తుతం అన్ని వయసుల వాళ్లనూ ఆకట్టుకుంటోంది. ఈ జీన్స్‌కు...
ఫ్యాషన్
స్కిన్నీ జీన్స్ స్థానాన్ని, బ్యాగీ జీన్స్ ఆక్రమించేశాయి. వైడ్ లెగ్, లూజ్ ఫిట్.. ఇలా పలు రకాల పేర్లతో ట్రెండ్ అవుతున్న బ్యాగీ జీన్స్ స్టైల్ ప్రస్తుతం అన్ని వయసుల వాళ్లనూ ఆకట్టుకుంటోంది. ఈ జీన్స్‌కు మరికాస్త స్టైల్‌ను జోడించి ఇదిగో ఇలా మెరిసిపోండి....
ఎన్ని ట్రెండ్స్ మారినా, అంతిమంగా సౌకర్యానికే పెద్ద పీట వేస్తూ ఉంటాం. తాజాగా ట్రెండ్ అవుతున్న బ్యాగీ జీన్స్ ఈ కోవకు చెందినవే! ఒంటికి పట్టేసినట్టుండే స్కిన్నీ ఫిట్ జీన్స్ స్థానాన్ని రిలాక్స్‌డ్ ఫిట్ జీన్స్ ఆక్రమిస్తే, వీటి స్థానాన్ని అంతకంటే సౌకర్యంగా ఉండే బ్యాగీ జీన్స్ ఆక్రమించేశాయి. నడుము దగ్గర బిగుతుగా ఉండి, పాదాల వరకూ వదులుగా, వెడల్పుగా విస్తరించే బ్యాగీ జీన్స్ కదలికలను ఆటంకం కలిగించకుండా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్యాంట్స్‌లో రకాలు కూడా ఉన్నాయి.
వెరైటీస్ బోలెడు
ఫేడెడ్, రిప్ప్‌డ్, వాష్‌డ్ జీన్స్‌తో పాటు, కార్గోను మరిపించే సిక్స్ పాకెట్ బ్యాగీ ప్యాంట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. సౌకర్యానికి పెద్ద పీట వేసేలా సర్దుబాటు చేసుకునే బటన్స్, బెల్ట్‌లతో, స్ట్రెచబుల్ డెనిమ్‌తో రూపొందుతున్నాయి.
బహుళ రంగుల్లో...
జీన్స్ నీలం, నలుపు రంగులకే పరిమితం కాదు. మరింత ట్రెండీగా ఉండే నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగుల జీన్స్ కూడా ఇప్పుడు రూపొందుతున్నాయి. మరి కాస్త భిన్నంగా కనిపించాలనుకునేవాళ్ల కోసం జంగిల్ డిజైన్, డెజర్ట్ డిజైన్స్ ఉండనే ఉన్నాయి.
మ్యాచింగ్ ఇలా...
బ్యాగీ జీన్స్‌కు జోడీగా క్రాప్ టాప్స్ ఎంచుకోవచ్చు. ఫిటెడ్ టాప్స్, టక్‌డ్ ఇన్ షర్ట్స్ కూడా సూటవుతాయి. కాళ్లకు పాయింటెడ్ టో హీల్స్, లోఫర్స్‌ను ఎంచుకోవాలి. రెట్రో స్నీకర్స్ జోడిస్తే రెట్టింపు స్టైలి్‌షగా కనిపిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం