Share News

అరెస్టుకు కారణాలను చెప్పాల్సిందే

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:43 AM

పోలీసులు ఎవరినైనా అరెస్టు చేసేటప్పుడు అందుకు గల కారణాలను అతడికి లిఖితపూర్వకంగా చెప్పాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలా చెప్పకుండా అరెస్టు చేస్తే సదరు పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది.

అరెస్టుకు కారణాలను చెప్పాల్సిందే
SUPREMECOURT

  • లేదంటే పోలీసులపై చర్యలు తప్పవు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీసులు ఎవరినైనా అరెస్టు చేసేటప్పుడు అందుకు గల కారణాలను అతడికి లిఖితపూర్వకంగా చెప్పాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలా చెప్పకుండా అరెస్టు చేస్తే సదరు పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. పంజాబ్‌కు చెందిన జస్కరన్‌ సింగ్‌ తన అరెస్టును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వెల్లడించకపోతే రాజ్యాంగంలోని 22(1) అధికరణం కింద ఆ ఆరెస్టు అక్రమం అవుతుందని స్పష్టం చేసింది. అంతేకాక ఒక వ్యక్తి అరెస్టు అక్రమమని కోర్టు ప్రకటించిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థ ఆ వ్యక్తిని మళ్లీ అరెస్టు చేయాలనుకుంటే అందుకు గల కారణాలను తెలుపుతూ సంబంధిత మేజిస్ట్రేటు అనుమతి తీసుకోవాలని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు

'బోన్‌ మ్యారో' టెస్టింగ్‌తో అత్యాచారం కేసు వెలుగులోకి.

Updated Date - Sep 22 , 2026 | 03:43 AM