భర్త చెల్లినే రెండో భార్యగా చూపి విడాకులు!
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:53 AM
ఓ మహిళ తన భర్త సొంత చెల్లినే అతడి రెండో భార్యగా చూపి ఫ్యామిలీ కోర్టును తప్పుదోవ పట్టించి విడాకులు పొందింది. విషయం తెలిసిన...
మధ్యప్రదేశ్‌లో ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన భర్త
గ్వాలియర్, ఏప్రిల్ 27: ఓ మహిళ తన భర్త సొంత చెల్లినే అతడి రెండో భార్యగా చూపి ఫ్యామిలీ కోర్టును తప్పుదోవ పట్టించి విడాకులు పొందింది. విషయం తెలిసిన భర్త తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. గ్వాలియర్ చెందిన మహిళ 1998లో మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేసే సదరు వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే అతడు వృత్తిరీత్యా ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 2015 నుంచి ఆమె భర్తకు దూరంగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె విడాకులు కావాలంటూ ఎన్ని సార్లు అడిగినా అతడు నిరాకరించాడు. అయితే 2021లో విడాకుల కోసం ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త మరో వివాహం చేసుకున్నాడని.. తనకు విడాకులు కావాలని కోరింది. ఇందుకు సాక్ష్యంగా భర్త, అతడి చెల్లి, ఇతర కుటుంబీకులతో ఉన్న ఓ ఫొటోను చూపింది. దీంతో కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది. ఈక్రమంలోనే ఏప్రిల్ నెలలో డివోర్స్ డిక్రీ రావడంతో భార్య సాక్ష్యంగా చూపిన ఫొటో గురించి అతడికి తెలిసింది. దీంతో అతడు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం