Share News

వితంతు కోడలు కూడా భరణం కోరవచ్చు

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:28 AM

హిందూ చట్టాల మేరకు భార్యను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత భర్త మరణంతో ముగిసిపోదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది...

వితంతు కోడలు కూడా భరణం కోరవచ్చు

ప్రయాగ్‌రాజ్‌, ఏప్రిల్‌1: హిందూ చట్టాల మేరకు భార్యను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత భర్త మరణంతో ముగిసిపోదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. వితంతువు.. మరణించిన భర్త ఆస్తి నుంచి, అవసరమైతే మామ నుంచి కూడా భరణం కోరవచ్చని పేర్కొంది. రామ్‌పూర్‌ ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వును సవాల్‌ చేస్తూ అకుల్‌ రస్తోగి అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్‌ అరిందమ్‌ సిన్హా, జస్టిస్‌ సత్యవీర్‌సింగ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. సదరు మహిళ ఉద్యోగం, ఆస్తుల గురించి కోర్టుకు అబద్ధం చెప్పారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొనగా.. అందుకు ఆధారాల్లేవని కోర్టు తోసిపుచ్చింది. ఆమె పేరుపై ఉన్న ఎఫ్‌డీలను తన తండ్రి చేశారని.. అయితే వివాహానంతరం పోషించాల్సిన బాధ్యత ఆ తండ్రికి ఉండదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ.. పిటిషనర్‌ భరణం చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:28 AM