Share News

భారత్‌పై క్యాన్సర్‌ పడగ..!

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:35 AM

క్యాన్సర్‌ మహమ్మారి భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తూ.. ప్రజారోగ్య వ్యవస్థకు సవాల్‌ విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్‌ పరిశోధనా విభాగం ‘గ్లోబోకాన్‌’ తాజా...

భారత్‌పై క్యాన్సర్‌ పడగ..!

  • ప్రతి 10 మందిలో ఒకరికి 75 ఏళ్లలోపే క్యాన్సర్‌

  • డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్‌ స్టేటస్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 9: క్యాన్సర్‌ మహమ్మారి భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తూ.. ప్రజారోగ్య వ్యవస్థకు సవాల్‌ విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్‌ పరిశోధనా విభాగం ‘గ్లోబోకాన్‌’ తాజా నివేదిక ప్రకారం దాదాపు ప్రతి 10 మంది భారతీయుల్లో ఒకరు 75 ఏళ్ల వయస్సుకు చేరకముందే క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. అలాగే ప్రతి 100 మందిలో సుమారు ఏడుగురు ఆ వయస్సు వచ్చేలోపే క్యాన్సర్‌ కారణంగా మరణించే ముప్పును ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌ ఆన్‌ క్యాన్సర్‌-2026 ప్రకారం 2024లో భారత్‌లో 16 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవగా.. దాదాపు 9 లక్షల మరణాలు సంభవించాయి. జనాభా పెరుగుదల, వృద్ధాప్యం, మారుతున్న జీవనశైలి కారణంగా 2050 నాటికి వార్షిక కొత్త కేసుల సంఖ్య 28 లక్షలకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదువుతున్న క్యాన్సర్‌ కేసుల్లో సగానికిపైగా భారత్‌, చైనాలోనే ఉంటున్నాయి. దీంతో ఈ మహమ్మారికి ఆసియా కేంద్ర బిందువుగా మారింది. పటిష్ఠమైన నివారణ, ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టకపోతే.. రాబోయే దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో మరిన్ని క్యాన్సర్‌ కేసులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 10 , 2026 | 05:35 AM