పోలీసులను నమ్మి మోసపోయా!
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:40 AM
కరూర్‌లో పోలీసులను నమ్మి తాను మోసపోయానని తమిళనాడు సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం విపరీతంగా పోగయ్యారని తాను కరూర్‌లోకి ప్రవేశించే ముందే..
ముందే హెచ్చరిస్తే ‘కరూర్’ దుర్ఘటన జరిగేది కాదు: విజయ్
చెన్నై, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కరూర్‌లో పోలీసులను నమ్మి తాను మోసపోయానని తమిళనాడు సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం విపరీతంగా పోగయ్యారని తాను కరూర్‌లోకి ప్రవేశించే ముందే పోలీసులు హెచ్చరించి ఉంటే సభను రద్దు చేసుకుని వెళ్లేవాడినన్నారు. ఊరి పొలిమేరలో పోలీసులు తమను సాదరంగా ఆహ్వానించి నగరంలోకి, విపరీతమైన జనంలోకి పంపి కపట నాటకమాడారని విజయ్ అన్నారు. కరూర్ దుర్ఘటనకు ఎవరు బాధ్యులో, ఎవరి సూచనల ప్రకారం ఆ దుర్ఘటన జరిగిందో తనకు బాగా తెలుసునని అన్నారు. కరూర్ రోడ్‌షోను సాకుగా పెట్టుకుని కుటిల రాజకీయాలు చేయాలనుకున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ఎన్నికల్లోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విజయ్ అన్నారు. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందినవారికి నివాళులర్పించేలా స్మారకస్థూపం ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. కరూర్ దుర్ఘటనలో చనిపోయిన 41మంది కుటుంబాల్లో 31 మందికి సీఎం విజయ్ శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈరోడ్‌కు చెందిన శాంతి అనే మహిళ ఉద్యోగం చేయలేని స్థితిలో వుండడంతో ఆమెకు రూ.10లక్షల ఆర్థికసాయాన్ని అందించారు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్