Share News

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష ప్రారంభం

ABN , Publish Date - May 13 , 2026 | 10:03 AM

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, అన్నాడీఎంకే కూడా అధికార టీవీకేకు మద్దతు ప్రకటించడంలో బలపరీక్షలో విజయ్ నెగ్గడం లాంఛనప్రాయమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష ప్రారంభం
Vijay floor test

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీలో తాజాగా కీలక ఘట్టం ప్రారంభమైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీవీకే పార్టీ అధినేత విజయ్ నేడు బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీవీకేకు మద్దతిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. హస్తం పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎమ్ఎల్, మద్దతు తెలపడంతో అధికార పక్షానికున్న సంఖ్యాబలం 120కు చేరింది. దీంతో, బలపరీక్షలో నెగ్గడం టీవీకే పార్టీకి లాంఛనప్రాయం కానుంది.


ప్రస్తుతం అసెంబ్లీలో 232 మంది సభ్యులు ఉన్నారు. మేజిక్ ఫిగర్ (117)కు మించి సంఖ్యాబలాన్ని టీవీకే కూడగట్టకలిగింది. ఇక అన్నాడీఎమ్‌కే‌లో సీవీ షణ్ముగం సారథ్యంలోని రెబెల్ వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకేకు మద్దతు ప్రకటించారు. ఈ బలపరీక్ష సందర్భంగా డీఎం‌కే వాక్‌ఔట్ చేస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే, అసెంబ్లీకి వచ్చిన పలువురు డీఎం‌కే ఎమ్మెల్యేలు ఈ విషయమై మీడియా ప్రశ్నలకు స్పందించలేదు.


ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీ పొదుపు చర్యలు.. కాన్వాయ్‌‌లో కార్ల సంఖ్య కుదింపు?

ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కొడుకు హఠాన్మరణం

Updated Date - May 13 , 2026 | 10:10 AM