ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హెచ్‌కే దువా కన్నుమూత
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:13 AM
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, మాజీ దౌత్యవేత్త హరికృష్ణన్ దువా(88) కన్నుమూశారు. అనారోగ్యంతో మూడు వారాల క్రితం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన....
న్యూఢిల్లీ, మార్చి 4: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, మాజీ దౌత్యవేత్త హరికృష్ణన్ దువా(88) కన్నుమూశారు. అనారోగ్యంతో మూడు వారాల క్రితం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గురువారం లోధి రోడ్‌లోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1937 జూలై 1న ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న సర్గోధాలో జన్మించిన దువా.. చిన్న వయసులోనే జర్నలిజంలోకి అడుగుపెట్టి ఎంతో పేరు తెచ్చుకున్నారు. పద్మభూషణ్‌తో పాటు జర్నలిజంలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. ది హిందుస్థాన్ టైమ్స్‌లో ఎడిటర్‌గా, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది ట్రిబ్యూన్‌లో ఎడిటర్ ఇన్ చీఫ్‌గా.. ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటోరియల్ అడ్వైజర్‌గా సేవలందించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డీ దేవే గౌడలు ప్రధానులుగా ఉన్నప్పుడు వారికి మీడియా సలహాదారుగా కూడా పనిచేశారు.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..