Share News

వెనెజువెలా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు!

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:25 AM

వెనెజువెలా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్లకు పైగా ముడిచమురు భారత్‌కు రానుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా...

వెనెజువెలా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు!

  • ఈ నెలలోనే భారత్‌ పశ్చిమ తీరానికి: కెప్లర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: వెనెజువెలా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్లకు పైగా ముడిచమురు భారత్‌కు రానుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ దిగుమతులు ఇంధన సంక్షోభాన్ని తగ్గించడానికి దోహదపడనున్నాయి. కెప్లర్‌ సంస్థ గణాంకాల ప్రకారం... ఈ నెలలోనే దేశ పశ్చిమ తీరానికి వెనెజువెలా నుంచి ముడిచమురు చేరనుంది. 2020 ఫిబ్రవరి తర్వాత ఆ దేశం నుంచి భారత్‌కు రానున్న చమురు దిగుమతుల్లో ఇదే అత్యధికం. ఈ సరుకు రవాణాకు సంబంధించిన ఒప్పందాలు ఇరాన్‌ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే కుదిరి ఉండొచ్చని కెప్లర్‌ విశ్లేషకుడు సుమిత్‌ రిటోలియాను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 06:25 AM