వందేభారత్ రైలు భోజనంలో పురుగులు.. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు జరిమానా
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:37 PM
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రితేష్ కుమార్ అనే ప్రయాణికుడికి ఈ అనుభవం ఎదురైంది (Vande Bharat worms in food).
రితేష్ కుమార్ మార్చి 15వ తేదీన పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో రితేష్‌కు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు కనిపించాయి. దీంతో షాకైన రితేష్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. రైల్వే సిబ్బంది కూడా ఆ భోజనాన్ని పరిశీలించారు. ఈ మొత్తం తతంగాన్ని రితేష్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది (IRCTC fined 10 lakh).
ఈ వీడియోపై రైల్వే మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది (Indian Railways food issue). ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అలాగే ఆ రైల్లో కేటరింగ్ చేసిన ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించడంతో పాటు అతడి కాంట్రాక్టును కూడా రద్దు చేసింది. రైల్వే ప్రయాణికుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యం అని తేల్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..
మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..