Share News

యూపీలో 2 కోట్ల ఓట్ల తొలగింపు

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:18 AM

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో 2.04 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. అయితే ఇదే సమయంలో 84 లక్షల మందికిపైగా ఓటు నమోదు చేసుకున్నారు..

యూపీలో 2 కోట్ల ఓట్ల తొలగింపు

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 10: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో 2.04 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. అయితే ఇదే సమయంలో 84 లక్షల మందికిపైగా ఓటు నమోదు చేసుకున్నారు. వెరసి రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ(సర్‌) పూర్తయిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య 13,39,84,792గా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) నవదీప్‌ రిన్వా వెల్లడించారు. శుక్రవారం తుది ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 7,30,71,071 మంది(54ు)..మహిళలు 6,09,09,525 మంది(45.46ు) అని తెలిపారు. ఓట్లు కోల్పోయిన వారు 15 రోజుల్లో జిల్లా కలెక్టర్లకు తొలి అప్పీల్‌ చేసుకోవచ్చని.. వారు తీసుకునే నిర్ణయాలపై అవి వెలువడిన 30 రోజుల్లో సీఈవోకు రెండో అప్పీల్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

చిన్నపిల్లల్లో జుట్టు తెల్లబడటానికి కారణాలు ఇవే

Updated Date - Apr 11 , 2026 | 06:18 AM