‘అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు’.. సెనెట్‌లో బిల్లు
ABN , Publish Date - Jul 30 , 2026 | 06:33 AM
ఏడేళ్లపాటు నిరంతరాయంగా అమెరికాలో ఉన్న వలసదారులకు గ్రీన్ కార్డు ఇవ్వాలని డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ అలెక్స్ పడిల్లా ప్రతిపాదించారు...
వాషింగ్టన్, జూలై 29: ఏడేళ్లపాటు నిరంతరాయంగా అమెరికాలో ఉన్న వలసదారులకు గ్రీన్ కార్డు ఇవ్వాలని డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ అలెక్స్ పడిల్లా ప్రతిపాదించారు. ఈ మేరకు ‘ది రిన్యూవింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 1929’ పేరుతో బిల్లును మరోసారి సెనెట్‌లో ప్రవేశపెట్టారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టానికి మానవీయ కోణాన్ని జత చేయాల్సిన అవసరాన్ని అలెక్స్ పేర్కొన్నారు. ‘కష్టజీవులైన వలసదారులపట్ల ట్రంప్ యంత్రాంగం అవలంభిస్తున్న అత్యంత క్రూరమైన విధనాలను వ్యతిరేకిస్తూ ఏడాది క్రితం నేను దీన్ని ప్రతిపాదించా. నాటి నుంచి ట్రంప్ చేస్తున్న దాడులు మరింత పెరిగాయి’ అని అలెక్స్ ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్