Share News

సివిల్స్‌ విజేతల ఉపకులాల వివరాలు నమోదు చేయండి

ABN , Publish Date - May 06 , 2026 | 06:03 AM

యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసు పరీక్షల్లో తుది విజయం సాధించిన అభ్యర్థుల ఉపకులాల వివరాలను..

సివిల్స్‌ విజేతల ఉపకులాల వివరాలు నమోదు చేయండి

  • ప్రభుత్వానికి సమాచర కమిషన్‌ సిఫార్సు

న్యూఢిల్లీ, మే 5: యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసు పరీక్షల్లో తుది విజయం సాధించిన అభ్యర్థుల ఉపకులాల వివరాలను ఇక నుంచి రికార్డుల్లో నమోదు చేయాలని ప్రభుత్వానికి కేంద్ర సమాచార కమిషన్‌ సిఫార్సు చేసింది. రిజర్వేషన్ల ఫలాలు కులాల వారీగా ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. 1995 నుంచి ఐఏఎ్‌సకు ఎంపికైన అభ్యర్థుల కులాల వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుపై రెండోస్థాయి విచారణ జరిపిన కమిషన్‌ ఈ సూచన చేసింది. అంతకుముందు కేంద్రం ఈ ఉపకులాల వివరాల రికార్డులు లేవని కమిషన్‌కు తెలిపింది.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 06:03 AM