యూపీ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అనుచరుల హల్‌చల్.. 28 మందిపై కేసులు..
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:46 AM
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు ఉమర్ అహ్మద్ అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నావాబ్‌గంజ్ టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ప్రయాగ్‌రాజ్ పోలీసులు 28 మందిపై కేసులు నమోదు చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు ఉమర్ అహ్మద్ అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నావాబ్‌గంజ్ టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ప్రయాగ్‌రాజ్ పోలీసులు 28 మందిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రోడ్డు ప్రమాదంలో రెండు రోజుల క్రితం మృతి చెందిన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం ఉమర్ తన అనుచరులతో 28 కార్లలో లఖ్‌నవూ నుంచి ప్రయాగ్‌రాజ్ బయలుదేరాడు.
సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల ప్రాంతంలో నావాబ్‌గంజ్ టోల్ ప్లాజా వద్ద ఉమర్ అనుచరులు టోల్ ఫీజు చెల్లించుకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టోల్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. టోల్ ఫీజు చెల్లించి అక్కడినుంచి వెళ్లమన్నారు. ఆగ్రహానికి గురైన ఉమర్ అనుచరలు హల్‌చల్ చేశారు. టోల్ సిబ్బందితో తప్పుగా ప్రవర్తించారు. అక్కడినుంచి వెళ్లిపోయే సమయంలో టోల్ బ్యారియర్‌ను ధ్వంసం చేశారు.
బూత్ నంబర్ 3 వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. టోల్ ప్లాజా అసిస్టెంట్ మేనేజర్ జైప్రకాశ్ యాదవ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమర్ అనుచరులు తమను కారుతో తొక్కించి చంపుతామని బెదిరింపులకు దిగినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భయపడిపోయిన టోల్ సిబ్బంది అక్కడినుంచి పక్కకు వచ్చేశారని తెలిపారు. యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు 28 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మెడికో ప్రియాంక కేసు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న రాజమండ్రి ఎమ్మెల్యే
వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం