చంపేస్తామంటూ కేంద్ర మంత్రికి బెదిరింపులు
ABN , Publish Date - Mar 20 , 2026 | 03:23 PM
కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరికి శుక్రవారంనాడు గుర్తుతెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) చీఫ్ జయంత్ చౌదరి (Jayant Chadudhary)కి శుక్రవారంనాడు గుర్తుతెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలర్‌ను పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందిన 'ఇస్మయిల్'గా గుర్తించారు. మంత్రి అధికారిక పర్యటన ప్లాన్‌ను అతను సంపాందించి బెదిరించినట్టు చెబుతున్నారు. ఈమేరకు ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. మొత్తం వ్యవహారంపై పశ్చిమంబెంగాల్ పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో స్కిల్ డవలప్‌మెంట్ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జ్)గా జయంత్ చౌదరి ఉన్నారు. ప్రాంతీయ పార్టీ అయిన ఆర్ఎల్‌డీ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బలంగా ఉంది. 2024 వరకూ అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీతో ఆర్ఎల్‌డీ పొత్తు పెట్టుకుంది. చౌదరి తాతగారు, మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో ఆర్ఎల్‌డీ చేతులు కలిపింది. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడంతో చౌదరి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆర్ఎల్‌డీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీతోనే పొత్తు.. ఊహాగానాలకు తెరదించిన పుదుచ్చేరి సీఎం
డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్