ఉబర్, ఓలా వంటి యాప్స్‌లో ప్రీరైడ్ టిప్‌లకు కేంద్రం చెక్
ABN , Publish Date - Aug 13 , 2026 | 02:16 PM
ఉబర్, ఓలా వంటి రైడ్ హెయిలింగ్ యాప్స్‌లో ప్రయాణికులు ముందస్తుగా టిప్స్ చెల్లించాల్సిన అగత్యం తప్పింది. ఈ ఒరవడికి చెక్ పెడుతూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉబర్, ఓలా వంటి రైడ్ హెయిలింగ్ యాప్స్‌లో ప్రయాణికులు ముందస్తుగా టిప్స్ చెల్లించాల్సిన అగత్యం తప్పింది. ఈ ఒరవడికి చెక్ పెడుతూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రీ రైడ్ టిప్స్ ఆప్షన్‌ను తక్షణం తొలగించాలని రైడ్ హెయిలింగ్ యాప్స్‌కు కేంద్రం స్పష్టం చేసింది. ప్రీ రైడ్ టిప్స్‌తో త్వరగా వాహనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న భావన కలిగించి ప్రయాణికుల నుంచి అదనపు డబ్బు తీసుకోరాదని కేంద్రం స్పష్టం చేసింది.
మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న అడ్వాన్స్ టిప్, ఛూజ్ యాన్ యాడాన్, క్వికర్ రైడ్ కన్వఫర్మేషన్ వంటి ప్రీరైడ్ టిప్ ఆప్షన్స్‌ను తొలగించాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రీరైడ్ టిప్ ఇస్తే డ్రైవర్ తమ అభ్యర్థనను త్వరగా ఆమోదిస్తారన్న భావన యూజర్లలో కలుగుతోందని పేర్కొంది.
ఈ మార్గదర్శకాల ప్రకారం, ప్యాసింజర్లు స్వచ్ఛందంగా, అదీ ప్రయాణం ముగిసిన తరువాతే టిప్ చెల్లించాలి. త్వరగా క్యాబ్ బుకింగ్ జరుగుతుందన్న భావనతో టిప్స్ ముందస్తుగా చెల్లించే పరిస్థితి ఉండకూడదు. ఇక ప్యాసింజర్ టిప్ మొత్తం డ్రైవర్‌కే బదిలీ చేయాలి. ఓలా, ఉబర్ వంటి వాహన అగ్రిగేటర్‌లు ఇందులో ఎలాంటి వాటా స్వీకరించకూడదు.
గతంలో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. త్వరగా రైడ్ బుక్ అవుతుందన్న భావన కలిగించి ప్రయాణికుల నుంచి ముందస్తుగా టిప్స్ వసూలు చేయొద్దని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ తీరుకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టింది.
ఈ వార్తలనూ చదవండి:
హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు