Share News

తిరుపత్తూరులో ఒక్క ఓటు మెజారిటీతో గెలుపు

ABN , Publish Date - May 06 , 2026 | 06:21 AM

ఒకే ఒక్క ఓటు ఆ నియోజకవర్గంలో ఫలితాన్ని తారుమారు చేసింది. మంత్రిగా పనిచేసిన నేతను ఇంటికి పంపేసింది. తమిళనాడులో సహకారశాఖ మంత్రిగా పని చేసిన...

తిరుపత్తూరులో ఒక్క ఓటు మెజారిటీతో గెలుపు

చెన్నై, మే 5 (ఆంధ్రజ్యోతి): ఒకే ఒక్క ఓటు ఆ నియోజకవర్గంలో ఫలితాన్ని తారుమారు చేసింది. మంత్రిగా పనిచేసిన నేతను ఇంటికి పంపేసింది. తమిళనాడులో సహకారశాఖ మంత్రిగా పని చేసిన డీఎంకే సీనియర్‌ నేత కేఆర్‌ పెరియకరుప్పన్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయన.. సమీప ప్రత్యర్థి, టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చేతిలో ఒకే ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలయ్యారు. చివరి రౌండ్‌ లెక్కింపునకు ముందు ఆయన 30 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గెలుస్తాననే ధీమాగా ఉన్న ఆయన చివరి రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యేసరికి దిగ్ర్భాంతికి గురయ్యారు. పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు రాగా, శ్రీనివాస సేతుపతికి 83,375 ఓట్లు వచ్చాయి. టీవీకే అభ్యర్థిని విజేతగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఫలితంపై డీఎంకే నేత ఉదయనిధి మాట్లాడుతూ.. తిరుపత్తూరు ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 06:21 AM