Share News

నేను రేపిస్ట్‌ను కాను!

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:26 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతసౌధం మీడియా ప్రతినిధుల విందులో కాల్పులకు తెగబడిన థామస్‌ అలెన్‌ రాసిన నోట్‌ను చదివిన విలేకరిపై...

నేను రేపిస్ట్‌ను కాను!

పిల్లలపై లైంగిక దాడి చేసే వ్యక్తినీ కాను

కాల్పుల నిందితుడు రాసిన అంశాలను

నాకు ఆపాదించొద్దు.. నేను నిర్దోషిని

అలాంటి అంశాలు చదవడం సిగ్గుచేటు

ఇంటర్వ్యూలో విలేకరిపై ట్రంప్‌ ఆగ్రహం

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతసౌధం మీడియా ప్రతినిధుల విందులో కాల్పులకు తెగబడిన థామస్‌ అలెన్‌ రాసిన నోట్‌ను చదివిన విలేకరిపై ట్రంప్‌ మండిపడ్డారు. విందులో కాల్పుల ఘటన జరగడానికి కొద్దిగా ముందు థామస్‌ అలెన్‌ తన ప్రణాళిక గురించి కుటుంబ సభ్యులకు మెయిల్‌ చేశాడు. ట్రంప్‌తో నిర్వహించిన ‘60 మినిట్స్‌’ ఇంటర్వ్యూలో సీబీఎస్‌ రిపోర్టర్‌ నోరా ఓ డోనెల్‌.. థామస్‌ ప్రణాళికను చదివారు. ‘‘పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్‌, ద్రోహి.. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని ఏమాత్రం అంగీకరించను’’ అని ఆ నోట్‌లో ఉన్న వాక్యాలను చదవగా.. ట్రంప్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను రేపి్‌స్టను కాదన్నారు. ‘అంటే అతను రాసింది మీ గురించే అనుకుంటున్నారా?’ అని నోరా ప్రశ్నించగా.. ఆమెపై ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘అతడే దాన్ని రాసుకున్నాడు. కానీ, నేను రేపి్‌స్టని కాను. ఏ మాత్రం సంబంధం లేనివాటిని నాకు ముడిపెట్టారు. నేను నిర్దోషిని’’ అని చెప్పారు. ‘‘మీరు ఆ నోట్‌ చదువుతారనే ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ఈ షోలో అలాంటివి కచ్చితంగా చదువుతారు. మీరు చాలా భయంకరమైన వ్యక్తులు. అతను రాసుకున్నాడేమో. కానీ, నేను రేపి్‌స్టని కాను. నేనెవరినీ రేప్‌ చేయలేదు’’ అని ట్రంప్‌ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ‘‘దయచేసి వినండి. నేను పిల్లలపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కాను. ఎవరో మానసిక ఆరోగ్యం సరిగా లేని వ్యక్తి రాసిన చెత్తను మీరు చదువుతున్నారు. అలాంటి అంశాలు చదవడం సిగ్గుచేటు. ఆ అంశాలతో నాకు సంబంధం లేదు’’ అని నోరాపై మండిపడ్డారు. ఇది చాలా అవమానకరమైన ప్రవర్తన అని ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, అతని నోట్‌ చదివానని, అది తన గురించే అనిపించేలా ఉందని ట్రంప్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 07:26 AM