Share News

ఝార్ఖండ్‌లో మావోయిస్టు పార్టీ

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:58 AM

నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు మిసిర్‌ బిస్రా(65)ను ఝార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌ జిల్లాలో...

ఝార్ఖండ్‌లో మావోయిస్టు పార్టీ

పొలిట్‌ బ్యూరో సభ్యుడు బెస్రా అరెస్టు

రాంచి(ఝార్ఖండ్‌), బీజాపూర్‌(ఛత్తీ్‌సగఢ్‌), జూలై 29 : నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు మిసిర్‌ బిస్రా(65)ను ఝార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌ జిల్లాలో మంగళవారం అరెస్టు చేశారు. 175 కేసుల్లో నిందితుడిగా ఉన్న బెస్రాపై 2.2 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఈ సందర్భంగా ఝార్ఖండ్‌ డీజీపీ తడాషా మిశ్రా బుధవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కీలక మావోయిస్టు నేతలందరు అరెస్టయినందున మావోయిస్టుల సమస్య పూర్తిగా పరిష్కారమయినట్లేనని చెప్పారు. బెస్రాతో పాటు రూ.15 లక్షల రివార్డు ఉన్న మెహ్‌నాత్‌ అలియాస్‌ మోచు, గౌరవ్‌ అనే ఇద్దరు మావోయిస్టులను కూడా అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు. బిహార్‌లో జెహానాబాద్‌ జైలు బ్రేక్‌ ఘటన, బ్యాంకు దోపిడీలు, భారీ ఎత్తున ఆయుధాల చోరీ వంటి పలు ముఖ్య ఘటనల్లో ఈ ముగ్గురి ప్రమేయం ఉందని ఈ సందర్భంగా ఝార్ఖండ్‌ పోలీసు అధికారులు చెప్పారు. 100 మందికి పైగా భద్రతా సిబ్బంది మరణానికి వీరు కారకులని తెలిపారు. కాగా ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో బుధవారం 8 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:58 AM