Share News

డేటింగ్‌ యాప్‌లో మోసపోయిన మహిళా న్యాయాధికారి!

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:32 AM

చండీగఢ్‌లో ఒక మహిళా న్యాయాధికారి డేటింగ్‌ యాప్‌ టిండర్‌ ద్వారా పరిచయం అయిన వ్యక్తి చేతిలో రూ.52 లక్షలు మోసపోయారు. తన పేరు బయటకు చెప్పుకోవడం ఇష్టంలేక తన...

డేటింగ్‌ యాప్‌లో మోసపోయిన మహిళా న్యాయాధికారి!

  • రూ.52 లక్షలకు ముంచిన ప్రేమికుడు

  • తన పనిమనిషి పేరుతో నిందితుడిపై కేసు

  • కోర్టులో అసలు విషయం చెప్పిన నిందితుడు

చండీగఢ్‌, జూన్‌ 12: చండీగఢ్‌లో ఒక మహిళా న్యాయాధికారి డేటింగ్‌ యాప్‌ టిండర్‌ ద్వారా పరిచయం అయిన వ్యక్తి చేతిలో రూ.52 లక్షలు మోసపోయారు. తన పేరు బయటకు చెప్పుకోవడం ఇష్టంలేక తన ఇంటి పనిమనిషి దీక్షాదేవిని ఆర్థికంగా మోసం చేశాడంటూ అతనిపై పోలీసు కేసు పెట్టించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపారు. నిందితుడి బెయిలు పిటిషన్‌ సెషన్స్‌ కోర్టులో విచారణకు వచ్చినపుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయింది పనిమనిషి దీక్షాదేవి కాదని, ఆమె ఇంటి యజమాని అయిన మహిళా న్యాయమూర్తేనని తేలింది. నిందితుడు దీపక్‌ వాట్స్‌ మహిళా న్యాయమూర్తికి 2025 నవంబరులో టిండర్‌ యాప్‌లో అభిమన్యు పేరుతో పరిచయం అయ్యాడు. తాను భారత ప్రభుత్వంలో రహస్య విభాగంలో పని చేస్తున్నానన్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అతడు అధిక లాభాలొస్తాయని చెప్పడంతో న్యాయాధికారి రూ.52లక్షలు నిందితుడి ఖాతాకు బదిలీ చేసింది. లాభాలు చూపకపోగా మొదటికే మోసం చేయడంతో ఆమె దీక్షాదేవి పేరుతో పోలీసులను అశ్రయించారు. తాజాగా, నిందితుడు బెయిలు పిటిషన్‌లో వాదనలు వినిపించినపుడు మహిళా న్యాయాధికారి, తాను కొన్ని నెలలుగా రిలేషన్‌షి్‌పలో ఉన్నామని, తానే బెట్టింగుల్లో పెట్టమని స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చిందని చెప్పాడు.

Updated Date - Jun 13 , 2026 | 07:00 AM