Share News

ఓఎస్ఎమ్ పోర్టల్‌లో లోపాలు బయటపెట్టిన టీనేజర్‌కు ఐఐటీ జాబ్

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:25 PM

ప్రశ్నపత్రాల మూల్యాకనం కోసం ఉద్దేశించిన సీబీఎస్‌ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో భద్రతా లోపాలు గుర్తించిన టీనేజర్ నిసర్గ అధికారికి బంపర్ ఆఫర్ లభించింది.

ఓఎస్ఎమ్ పోర్టల్‌లో లోపాలు బయటపెట్టిన టీనేజర్‌కు ఐఐటీ జాబ్
Nisarg C3iHub

ఇంటర్నెట్ డెస్క్: సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాల మూల్యాకనం కోసం ఉద్దేశించిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థలో భద్రతా లోపాలు గుర్తించిన టీనేజర్ నిసర్గ అధికారికి బంపర్ ఆఫర్ లభించింది. ఐఐటీ కాన్పూర్ ఆధ్వర్యంలోని సీ3ఐహబ్‌లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా జాబ్ లభించింది.

నిసర్గ నియామకాన్ని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహీంద్ర అగ్రవాల్ ఒక బ్లాగ్ పోస్టులో ధ్రువీకరించారు. నిసర్గకు ఇచ్చిన ఆఫర్ విద్యాపరమైనది కాదని పేర్కొన్నారు. సైబర్ భద్రతా నిపుణుడిగా అతడిని నియమించుకున్నట్టు చెప్పారు. ‘అతడు టాలెంట్ ఉన్న యువ ఇంజనీర్. చాలా చిన్నతనంలోనే అద్భుత సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఐఐటీలో ఆఫర్‌తో అతడికి తన నైపుణ్యాలకు మరిన్ని మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము’ అని ప్రొఫెసర్ అగ్రర్వాల్ రాసుకొచ్చారు. సీ3ఐహబ్‌లో చేపట్టే కార్యక్రమాలకు అతడి నైపుణ్యాలతో ప్రయోజనం కలుగుతుందని కూడా చెప్పారు.


అయితే, నిసర్గకు ఇచ్చే ప్యాకేజీ ఎంతనేది మాత్రం తెలియరాలేదు. తనకు గౌరవప్రదమైన పారితోషికమే లభించిందని నిసర్గ తెలిపాడు. అయితే, తాను మొదట్లో ఆశించిన దానికంటే ఇది కాస్త తక్కువేనని అన్నాడు. నిసర్గ ఆరేళ్ల వయసులోనే కోడింగ్ ప్రారంభించాడు. సైబర్ భద్రతపై ఆసక్తితో అతడు తనంతట తానుగా ఈ రంగంపై పట్టుసాధించాడు. 6వ తరగతిలో ఉండగానే సైబర్ భద్రతా పోటీల్లో పాల్గొనేవాడు. ఇప్పటికే పలు ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు నిర్వహించి డాలర్లల్లో పారితోషికం అందుకున్నాడు.


ఈ వార్తలనూ చదవండి

వారం రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..

అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం.. ఐదుగురి మృతి

Updated Date - Jun 13 , 2026 | 01:35 PM