టీసీఎస్ దర్యాప్తులో డెలాయిట్‌కు చోటు!
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:46 AM
టీసీఎస్ నాసిక్ బీపీవోలో లైంగిక వేధింపులు, మతమార్పిడి ప్రయత్నాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ మొత్తం వ్యవహారంపై జరిపే అంతర్గత దర్యాప్తులో....
బీఎస్‌ఈకి సమాచామిచ్చిన కంపెనీ
నిదా ఖాన్ హెచ్‌ఆర్ కాదని స్పష్టీకరణ
పోష్ కమిటీకి లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: టీసీఎస్ నాసిక్ బీపీవోలో లైంగిక వేధింపులు, మతమార్పిడి ప్రయత్నాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ మొత్తం వ్యవహారంపై జరిపే అంతర్గత దర్యాప్తులో ప్రపంచ ప్రఖ్యాత ఆడిట్ అండ్ ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థ డెలాయిట్‌ను, ప్రముఖ భారతీయ లాఫర్మ్ ట్రైలీగల్‌ను భాగస్వాములను చేసింది. ఈ మేరకు టీసీఎస్ బీఎ్‌సఈకి సమాచారం అందించింది. అంతర్గత దర్యాప్తునకు టీసీఎస్ సీవోవో ఆర్తీ సుబ్రమణియన్ నేతృత్వం వహిస్తారు. రెండు సంస్థల నిపుణుల బృందాలు టీసీఎస్ దర్యాప్తులో భాగం పంచుకుంటాయి. టీసీఎ్‌సలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న కేకీ మిస్త్రీ నేతృత్వంలో పర్యవేక్షక కమిటీని వేస్తున్నామని సంస్థ తెలిపింది. దర్యాప్తు బృందం నివేదికను పర్యవేక్షక కమిటీకి అందిస్తారు. లైంగిక వేధింపులకు సహకరించిందని చెబుతున్న నిదా ఖాన్ తమ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్ కాదని టీసీఎస్ బీఎ్‌సఈకి సమాచారం ఇచ్చింది. ఆమెకు ఎలాంటి రిక్రూట్మెంట్ బాధ్యతలు లేవని స్పష్టం చేసింది. ఆమె కేవలం ప్రాసెస్ అసోసియేట్‌గా చేసినట్లు వెల్లడించింది. నాసిక్ బీపీవో మూతపడినట్లు వచ్చిన వార్తలను టీసీఎస్ ఖండించింది. అక్కడ సేవలు కొనసాగుతున్నాయని చెప్పింది. తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం లైంగిక వేధింపుల నివారణ(పోష్) కమిటీకి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..