బంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:11 AM
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదే శాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ...
కొత్త ప్రభుత్వంలో ఓ హిందూ మంత్రి!
ఢాకా, ఫిబ్రవరి 17: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదే శాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ హాజరయ్యారు. గత 35 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ను మహిళా ప్రధానులే పాలిస్తూ వచ్చారు. మాజీ ప్రధాని ఖలిదా జియా వారసుడిగా సుదీర్ఘ కాలం తర్వాత ఆ దేశపగ్గాలు చేపట్టిన పురుష ప్రధానిగా రెహమాన్ నిలిచారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, ప్రజాస్వామ్య వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడమే తనముందున్న ప్రధాన లక్ష్యమని తారిఖ్ స్పష్టం చేశారు. 50మంది సభ్యులతో ఏర్పాటుచేసిన క్యాబినెట్‌లో.. బీఎన్‌పీ వైస్ చైర్మన్ నీతాయ్ రాయ్ చౌదరి ఏకైక హిందూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటూ యూనస్.. భారత ఈశాన్య రాష్ట్రాలను ప్రత్యేక దేశం అనే అర్థం వచ్చేలా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ