Share News

800 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన వ్యాన్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:36 AM

తమిళనాట విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పారై పర్యాటక ప్రాంతంలో కేరళ పర్యాటకులతో వచ్చిన వ్యాన్‌ 800 అడుగుల ఎత్తు నుంచి...

800 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన వ్యాన్‌

  • పది మంది దుర్మరణం.. తమిళనాట ఘటన

చెన్నై, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): తమిళనాట విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పారై పర్యాటక ప్రాంతంలో కేరళ పర్యాటకులతో వచ్చిన వ్యాన్‌ 800 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడడంతో పది మంది దుర్మరణం చెందగా, మరో ఆరుగురు గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. కేరళలోని మలప్పురలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 16 మంది ఉపాధ్యాయుల బృందం 15న కోయంబత్తూరు జిల్లా వాల్పారైకి వచ్చింది. ఈ బృందం శుక్రవారం సాయంత్రం పొల్లాచ్చి మీదుగా కేరళకు తిరుగుముఖం పట్టింది. అయితే వాల్పారై కొండ 13వ మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌.. అదుపుతప్పింది. రోడ్డుపక్కనున్న గోడను ఢీకొట్టి 800 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న 11వ మలుపు వద్ద పడిపోయింది. ఈ ఘటనలో వ్యాన్‌ మొత్తం నుజ్జనుజ్జయిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని పొల్లాచ్చి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 06:36 AM