Share News

జస్ట్‌.. సరదాకే వాళ్లకి గుండు కొట్టించాను..!

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:39 AM

మాయమాటలతో మహిళలకు గుండుగీయించిన కేసులో తమిళనాడు పోలీసులు నిందితుడు సతీశ్‌ను అరెస్టు చేశారు...

జస్ట్‌.. సరదాకే వాళ్లకి గుండు కొట్టించాను..!

  • తమిళనాడులో మహిళలకు గుండు కేసులో నిందితుడు

చెన్నై, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మాయమాటలతో మహిళలకు గుండుగీయించిన కేసులో తమిళనాడు పోలీసులు నిందితుడు సతీశ్‌ను అరెస్టు చేశారు. కేవలం ఆటపట్టించాలన్న ఉద్దేశంతోనే ఆ మహిళలకు మాయమాటలు చెప్పినట్టు సతీ్‌షకుమార్‌ పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలిసింది. కరోనాలాంటి కొత్తరకం వ్యాధి వస్తోందని, అడ్డుకునేందుకు గుండు గీయించుకోవాలని, అలాంటి వారికి రూ.15 వేలు ఇస్తామంటూ సతీశ్‌ సేలం జిల్లా పుదుకొత్తంబాడికి చెందిన మహిళలకు ఫోన్‌ చేసి చెప్పాడు. నమ్మిన ముగ్గురు మహిళలు గుండు గీయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:39 AM