Share News

ఉంగరంపై సీఎం రూపం

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:43 AM

ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం కింద పంపిణీ చేయనున్న గ్రాము ఉంగరంపై...

ఉంగరంపై సీఎం రూపం

  • కొలిక్కి వచ్చిన ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం

  • తొలిదశలో 1,28,499 ఉంగరాలు తయారు

  • రూ.755 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం

చెన్నై, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం కింద పంపిణీ చేయనున్న గ్రాము ఉంగరంపై సీఎం విజయ్‌ రూపం, ప్రభుత్వ ముద్ర ఉండబోతునున్నాయి. తాము అధికారంలోకి వస్తే మేనమామ పథకం కింద శిశువులకు ఉంగరాలు పంపిణీ చేస్తామని టీవీకే అధినేత విజయ్‌ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఉంగరాలు తయారు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం టెండరు ఆహ్వానించింది. పైసా సర్వీసు ఫీజుతో ప్రముఖ జ్యువెలరీ సంస్థ టెండరు దక్కించుకుంది. పథకం అమలుకు ఈ ఏడాదికి రూ.755.83 కోట్లను కేటాయించింది. జోయ్‌ ఆలూక్కాస్‌ సంస్థకు 70 శాతం, కల్యాణ్‌ జ్యువెలర్స్‌ సంస్థకు 30 శాతం పనులు అప్పగించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. సెప్టెంబరు 15న దివంగత మాజీ సీఎం అన్నాదురై జయంతి రోజున ఈ పథకాన్ని సీఎం విజయ్‌ ప్రారంభించనున్నారు. తొలిదశగా 1,28,499 ఉంగరాలు తయారుచేసేలా ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - Aug 24 , 2026 | 06:43 AM