ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించాలి!
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:09 AM
దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించేలా రాజకీయపార్టీల నేతలు వ్యవహరించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. రాజకీయ నేతల ప్రసంగాలపై, వాటికి మీడియా ఇచ్చే కవరేజీపై...
రాజకీయ నాయకులకు సుప్రీంకోర్టు హితవు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించేలా రాజకీయపార్టీల నేతలు వ్యవహరించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. రాజకీయ నేతల ప్రసంగాలపై, వాటికి మీడియా ఇచ్చే కవరేజీపై మార్గదర్శకాలు వెలువరించాలని కోరుతూ ప్రొఫెసర్ రూప్‌రేఖవర్మ తదితరులు 12 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ వివాదాస్పద ప్రసంగాల నేపథ్యంలో దాఖలైన ఈ పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఏదో ఒక నాయకుడికి వ్యతిరేకంగా ఇది దాఖలు కాలేదన్నారు. దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలు విషాన్ని వెదజల్లుతున్నాయని, వాటిని అరికట్టాలని అన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. పిటిషన్లు ఒక రాజకీయపార్టీకి, అందులోనూ ఆ పార్టీకి చెందిన కొందరికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. దీనికి బదులుగా.. ప్రసంగాలపై ఇప్పుడున్న నిబంధనలు ఏమిటి? వాటిని రాజకీయపార్టీలు ఎలా ఉల్లంఘిస్తున్నాయన్న వివరాలతో కొత్త పిటిషన్ దాఖలు చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ