Share News

తప్పుచేస్తే చావే! మహిళలపై నేరాలకు పాల్పడే వారిలో ఆ భయం పుట్టించాలి

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:11 AM

దేశ రాజధాని ఢిల్లీలో.. ముఖ్యంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళలకు భద్రత లేదన్న భావన నెలకొందని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.

తప్పుచేస్తే చావే!  మహిళలపై నేరాలకు పాల్పడే   వారిలో ఆ భయం పుట్టించాలి
SUPREMECOURT

  • తప్పుచేస్తే చావే!

  • మహిళలపై నేరాలకు పాల్పడే

వారిలో ఆ భయం పుట్టించాలి

  • అత్యాచారాలను అరికట్టడమే

తక్షణ కర్తవ్యం

  • మానవ హక్కులపై గగ్గోలు

పెట్టేవారుంటారు

  • ఖాకీలు తమ విధి నిర్వర్తించాలి

  • నేరం జరిగాక ఏం చేశామన్నది

కాదు..

  • అది జరగకుండా

నివారించడం ముఖ్యం: సుప్రీం

  • ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌ ఘటనలపై

సుమోటో విచారణ

న్యూఢిల్లీ, అక్టోబరు 5: దేశ రాజధాని ఢిల్లీలో.. ముఖ్యంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళలకు భద్రత లేదన్న భావన నెలకొందని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. మహిళలపై నేరాలకు పాల్పడే గూండాల గుండెల్లో భయం పుట్టించాల్సిన అవసరం ఉందని.. తప్పుచేస్తే చస్తామన్న భయం పుట్టాలని స్పష్టంచేసింది. రాజధాని ప్రాంతంలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టిన జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం.. పై వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీ రోడ్లపైన, మెట్రోలో అర్ధరాత్రి 11గంటలకు ప్రయాణించేటప్పుడు కూడా సురక్షితమేనన్న భరోసా ప్రతి మహిళకూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేరం జరిగిన తర్వాత ఏం చేశామన్నది కాదు.. అసలు నేరం జరుగకుండా నివారించడం ముఖ్యం’ అని తెలిపింది. 2012 నిర్భయ గ్యాంగ్‌రేప్‌ కేసును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ‘2012లో ఏం జరిగిందో మీకు తెలుసు. నిందితులు మద్యం తాగి బస్సెక్కి.. దారుణ అత్యాచారానికి పాల్పడ్డారని కేసు రికార్డు చెబుతోంది. పోలీసులు బీట్‌ పెట్రోలింగ్‌ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలతో నిత్యం సంభాషిస్తూ ఉండాలి. మిమ్మల్ని చూసి ప్రజలు పారిపోకూడదు. నిందితుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. 21వ అధికరణ (మానవ హక్కుల పరిరక్షణ) గురించి గగ్గోలు పెట్టేవారు ఉంటారు. కానీ మీ విధి మీరు నిర్వర్తించాలి. అత్యాచారాల వంటి నేరాలు జరక్కుండా చూడడమే మన కర్తవ్యం.


తప్పు చేస్తే చస్తామన్న భయాన్ని గూండాలు, సంఘవిద్రోహ శక్తుల గుండెల్లో కలిగించాలి. లేదంటే ఈ నేరాలను నియంత్రించలేరు. అత్యాచారానికి గురైన ప్రతి మహిళ, బాలిక మన తల్లులు, సోదరీమణులే’ అని జస్టిస్‌ పార్దివాలా అన్నారు. సీసీటీవీ కెమేరాలను నిరంతరాయంగా వార్‌రూంలో పర్యవేక్షించకపోతే.. ఆ కెమేరాలతో నిఘాపెట్టి ఉపయోగమేంటని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 05:12 AM