విద్యుత్తు నియంత్రణ మండళ్లలో ఖాళీలపై సమాధానం ఇవ్వండి
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:40 AM
రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఎస్ఈఆర్‌సీ)లలో వివిధ పదవులను దీర్ఘకాలం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడంపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సహా...
ఏపీ సహా 15 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, అక్టోబరు 9: రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఎస్ఈఆర్‌సీ)లలో వివిధ పదవులను దీర్ఘకాలం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడంపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సహా 15 రాష్ట్రాలకు, టకేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌లకు శుక్రవారం నోటీసులు పంపించింది. ఎస్‌ఈఆర్‌సీలు కోర్టుల్లాంటివేనని, చైర్‌పర్సన్, సభ్యులను తప్పకుండా నియమించాల్సి ఉందంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ ఎనర్జీ వాచ్‌డాగ్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిల్‌పై ఈ ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో చైర్‌పర్సన్, టెక్నికల్ సభ్యుడి పదవులు ఖాళీగా ఉన్నాయని, ఫైనాన్స్ సభ్యుడి ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు