Share News

ఎస్సీ కమిషన్‌ సలహా సంఘం మాత్రమే: సుప్రీం

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:42 AM

జాతీయ ఎస్సీ కమిషన్‌(ఎన్‌సీఎ్‌ససీ) కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలదని, తమ సిఫారసులను తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ ఆదేశించే అధికారం దానికి లేదని...

ఎస్సీ కమిషన్‌ సలహా సంఘం మాత్రమే: సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 29: జాతీయ ఎస్సీ కమిషన్‌(ఎన్‌సీఎ్‌ససీ) కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలదని, తమ సిఫారసులను తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ ఆదేశించే అధికారం దానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్‌సీఎ్‌ససీ రాజ్యాంగబద్ధ సంస్థే అయినప్పటికీ దానికి న్యాయాధికారాలు లేవని, కోర్టుల్లాగా అది తీర్పులు ఇవ్వలేదని పేర్కొంది. జాతీయ బీసీ కమిషన్‌కు కూడా ఇదే వర్తిస్తుందని జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వివరించింది. ముంబై పోర్టు అథారిటీలో ఎస్సీ ఉద్యోగి ప్రమోషన్‌కు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ప్రమోషన్‌లో రిజర్వేషన్‌ పాటించాలని గతంలో ఎస్సీ కమిషన్‌ ముంబై పోర్టు అథారిటీని ఆదేశించింది. దీనిపై అథారిటీ తొలుత బాంబే హైకోర్టును, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:42 AM