Share News

అత్యవసర కేసుల ప్రస్తావనల వేళ

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:36 AM

అత్యవసర కేసులను విచారణకు తీసుకునే సమయంలో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ముందు న్యాయవాదులు చేసే అభ్యర్థనలు, కోర్టు ప్రతిస్పందనలకు సంబంధించిన సంభాషణల..

అత్యవసర కేసుల ప్రస్తావనల వేళ

సుప్రీంకోర్టులో లైవ్‌ ఆడియో మ్యూట్‌

న్యూఢిల్లీ, జూలై 29: అత్యవసర కేసులను విచారణకు తీసుకునే సమయంలో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ముందు న్యాయవాదులు చేసే అభ్యర్థనలు, కోర్టు ప్రతిస్పందనలకు సంబంధించిన సంభాషణల లైవ్‌ ఆడియోను మ్యూట్‌ చేయాలని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల లైవ్‌ వీడియో యథాతథంగా వస్తున్నప్పటికీ ఆ సమయంలో మాటలేవీ ప్రజలకు, మీడియాకు వినపడవు.. బుధవారమే ఇది అమల్లోకి వచ్చింది. సీజేఐ ముందు న్యాయవాదులు అత్యవసర కేసులను ప్రస్తావిస్తున్న సమయంలో ప్రత్యక్ష ప్రసార ఆడియోను మ్యూట్‌ చేశారు. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉంది. ఇటీవల కాలంలో రాజకీయ ప్రాముఖ్యమున్న పలు కేసులు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ముందు ప్రస్తావనకు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక విచారణ ప్రారంభించకముందే న్యాయవాదులతో సంభాషణల సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారమయ్యాయి.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:36 AM