ట్రాన్స్‌జెండర్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోండి!
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:27 AM
‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) సవరణ బిల్లు- 2026’ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని...
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) సవరణ బిల్లు- 2026’ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కొత్త బిల్లు ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవానికి, ప్రాథమిక హక్కులకు సంకెళ్లు వేసేలా ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. లింగ గుర్తింపు కారణంతో ఉపాధి కోల్పోయిన ఓ ట్రాన్స్‌జెండర్ (ఉపాధ్యాయురాలు) కేసు విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం.. 2025 అక్టోబరు 17న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..