Share News

బొగ్గు స్కాంలో మన్మోహన్‌ సింగ్‌పై కేసు మూసివేత

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:44 AM

బొగ్గు గనుల కేటాయింపుపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై నమోదైన క్రిమినల్‌ కేసును సుప్రీం కోర్టు మూసివేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ...

బొగ్గు స్కాంలో మన్మోహన్‌ సింగ్‌పై కేసు మూసివేత

సీబీఐ క్లోజర్‌ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూలై 29: బొగ్గు గనుల కేటాయింపుపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై నమోదైన క్రిమినల్‌ కేసును సుప్రీం కోర్టు మూసివేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పటికే దివంగత మన్మోహన్‌ సింగ్‌కు సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, కేసును ముగించాలంటూ సీబీఐ ఇచ్చిన నివేదికను తోసిపుచ్చిన ప్రత్యేక కోర్టు మన్మోహన్‌, తదితరులకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సుప్రీం కోర్టు స్టే విధించిన విషయమూ విధితమే. తాజాగా ఈ కేసును పూర్తిగా ముగిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. 2025లో ఒడిశాలోని తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపుపై మన్మోహన్‌ సింగ్‌, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, బోగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరాఖ్‌, మరో ముగ్గురిపై కేసు నమోదైన విషయం విదితమే.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:44 AM