‘ఎల్‌నినో’తో 4.5 లక్షల మరణాలు
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:37 AM
రానున్న నెలల్లో ఎల్‌నినో తీవ్రతరమై సూపర్ ఎల్‌నినోగా మారి, వాతావరణ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగనున్నాయని.. ఫలితంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు 4,51,000 మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఓ అధ్యయన సంస్థ హెచ్చరించింది.
ఫిబ్రవరిలోపు ప్రపంచవ్యాప్తంగా సంభవించే
ప్రమాదం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
భారత్‌పైనా తీవ్ర ప్రభావం
15,800 మందికి ప్రాణాపాయం
క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదికలో హెచ్చరికలు
సూపర్ ఎల్‌నినోతో 4.5 లక్షల మరణాలు!
వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రమాదం
భారత్‌పైనా గణనీయంగా ప్రభావం.. రానున్న వేసవి నిప్పుల కుంపటే
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: రానున్న నెలల్లో ఎల్‌నినో తీవ్రతరమై సూపర్ ఎల్‌నినోగా మారి, వాతావరణ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగనున్నాయని.. ఫలితంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు 4,51,000 మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఓ అధ్యయన సంస్థ హెచ్చరించింది. అమెరికాకు చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అనే సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఎల్‌నినో వల్ల దక్షిణార్ధగోళంలోని దేశాల్లోనే ఉండటం గమనార్హం. నైజీరియా, సుడాన్, నైగర్, చాద్ తదితర ఆఫ్రికా దేశాల్లో 66,800 మంది, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, కాంబోడియా తదితర దేశాల్లో 19,400 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, భారత్‌లో 15,800 మంది, బ్రెజిల్‌లో 13,300 మంది మరణిస్తారని తెలిపింది. ఈ మరణాలను నివారించటానికి ప్రభుత్వాలు ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయటం, కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయటం, ప్రజలకు వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టటం, బహిరంగ స్థలాల్లో పని చేసే కార్మికులకు రక్షణ కల్పించటం, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయటం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఉత్తరార్ధగోళంలో సెప్టెంబరు-నవంబరు మధ్య ఉండే శరదృతువులో, శీతాకాలంలో అత్యంత తీవ్ర ఎల్‌నినోకు 90శాతం అవకాశం ఉందని పేర్కొంది. ‘‘ఎల్‌నినో తీవ్రత ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నెల.. చరిత్రలోనే అత్యంత ఉక్కపోత నమోదైన ఆగస్టు నెలగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది వేగంగా తీవ్రతరమవుతున్న ఎల్‌నినోకు, దీర్ఘకాలంపాటు కొనసాగే గ్లోబల్‌వార్మింగ్‌కు సంకేతం’’ అని అభివర్ణించింది.
ఖరీఫ్ పంటలకు పెరుగుతున్న ముప్పు
ఎల్‌నినో మరింత బలపడుతుండటంతో రానున్న రోజుల్లో వర్షపాతంలోటు మరింత పెరుగుతుందని, ఇది వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఈనెల 17వ తేదీ నాటికి దేశంలోని రిజర్వాయర్లలో 71 శాతం మాత్రమే నీరు నిల్వ ఉందని, దక్షిణ భారతంలో ఇంకా తక్కువగా రిజర్వాయర్ల సామర్థ్యంలో 52 శాతం మాత్రమే నీరు నిల్వ ఉందని పేర్కొంది. ఈనెల 21వ తేదీ నాటికి దేశంలో దీర్ఘకాలిక సగటు కంటే 15 శాతం తక్కువగా 704 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. ప్రాంతాల వారీగా చూస్తే.. దక్షిణభారతంలో లోటు 27 శాతం, తూర్పు భారతంలో 26 శాతం, మధ్య భారతంలో 6శాతం, వాయవ్య భారతంలో 10శాతం నమోదైందని పేర్కొంది. మరింత బలపడుతున్న ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయానికి ముప్పుగా పరిణమించనున్నాయని నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి
రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్.
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..