Share News

అది నిజం కాదు.. ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది: సునీతా విలియమ్స్

ABN , Publish Date - Jan 22 , 2026 | 07:30 PM

అంతరిక్షం నుంచి భూమిని ఓ గ్రహంగా చూసినప్పుడు జీవితం పట్ల తన దృక్పథం మారిందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశాన్ని సందర్శిస్తున్న ఆమె ఓ జాతీయ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

అది నిజం కాదు.. ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది: సునీతా విలియమ్స్
Sunita Williams

అంతరిక్షం నుంచి భూమిని ఓ గ్రహంగా చూసినప్పుడు జీవితం పట్ల తన దృక్పథం మారిందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశాన్ని సందర్శిస్తున్న ఆమె ఓ జాతీయ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతరిక్షాన్ని అన్వేషించే సామర్థ్యం అసాధారణమైనదని పేర్కొన్నారు. సునీతా విలియమ్స్‌ నాసాలో దాదాపు మూడు దశాబ్దాలు పనిచేశారు. 2025 డిసెంబర్‌ 27న పదవీ విరమణ చేశారు (Sunita Williams interview).


తాజాగా సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. 'ఈ విశ్వంలో ప్రతి దానిని కనిపెట్టేశారని నా చిన్నప్పుడు అనుకునేదాన్ని. కానీ, వ్యోమగామిగా మారిన తర్వాత చాలా కొత్త విషయాలు తెలిశాయి. ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మీ ఊహకు పరిమితి ఉంటుందేమో.. ఈ విశ్వంలో అద్భుతాలకు పరిమితి లేదు' అని అన్నారు. పదవీ విరమణ తర్వాత ఏం చేస్తారని అడిగినప్పుడు, తన దగ్గర ఎటువంటి ఖచ్చితమైన ప్రణాళికలూ లేవని చెప్పారు (NASA astronaut story).


మూడుసార్లు అంతరిక్షయానం చేసిన సునీతా విలియమ్స్.. 608 రోజులు స్పెస్ సెంటర్‌లో ఉండి సుదీర్ఘ కాలం అంతరిక్షయానం చేసిన వ్యోమగాముల జాబితాలో చేరారు (space mission challenges). ఆ అనుభవం గురించి కూడా ఆమె మాట్లాడారు. 'అక్కడ గడిపిన సమయం నాకు చాలా విలువైనది. మళ్లీ అలాంటి అవకాశం రాదని నాకు తెలుసు. ప్రతి రోజు భిన్నంగా ఉంటుంది. ప్రతి రోజు సరదాగా ఉంటుంది. ఎన్నో అద్భుతాలను చూసే అవకాశం అందరికీ రాదు' అని సునీతా విలియమ్స్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..


మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 22 , 2026 | 07:30 PM