పంచదార నిల్వలపై ఆంక్షలు కఠినం!
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:46 AM
శ్రావణ, భాద్రపద మాసాల్లో వరుస పండుగల నేపథ్యంలో పంచదార నిల్వలపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఆ నిల్వలపై పరిమితులను కేంద్రం కఠినతరం..
టోకు వర్తకులకు 15 రోజుల సరిపడా నిల్వలకే అనుమతి
న్యూఢిల్లీ, ఆగస్టు 20: శ్రావణ, భాద్రపద మాసాల్లో వరుస పండుగల నేపథ్యంలో పంచదార నిల్వలపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఆ నిల్వలపై పరిమితులను కేంద్రం కఠినతరం చేసింది. బడా పారిశ్రామికవేత్తలు 15 రోజుల సరిపడా అవసరాలకు మించి చెక్కెరను నిల్వ చేసుకోకుండా పరిమితి విధించింది. మిఠాయి, శీతలపానీయ తయారీదారులకూ ఈ పరిమితులను విస్తరించింది. ఆగస్టు 19న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నెలకు 10టన్నుల కన్నా ఎక్కువ పంచదారను వినియోగించే వినియోగదారులు 15రోజులకు సరిపడా నిల్వను మాత్రమే దగ్గర పెట్టుకోవాలి. ఈ ఆంక్షలు నవంబరు 30వ తేదీ వరకు వర్తిస్తాయి.