ఆటిజంకు మూలకణ చికిత్స చట్ట విరుద్ధం
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:25 AM
ఆటిజంకు మూలకణ చికిత్స అందించడం చట్ట విరుద్ధమని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) హెచ్చరించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు...
వైద్యులకు జాతీయ వైద్య కమిషన్ అడ్వైజరీ
న్యూఢిల్లీ, మార్చి 26: ఆటిజంకు మూలకణ చికిత్స అందించడం చట్ట విరుద్ధమని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) హెచ్చరించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు... దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని, ఇది రోగులకు హానికరమని పేర్కొంటూ దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, నమోదిత వైద్యులకు బుధవారం అడ్వైజరీ జారీచేసింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎ్‌సడీ), సెరిబ్రల్ పాల్సీ బాధితులకు మూలకణ చికిత్స అందిస్తామంటూ మెట్రోపాలిటన్, టైర్-2 నగరాల్లోని అనేక ప్రైవేట్ క్లినిక్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలను అరికట్టేందుకు ఈ అడ్వైజరీ జారీచేసినట్టు ఎన్‌ఎంసీ తెలిపింది. ఈ అడ్వైజరీ ప్రకారం.. 32 ఆమోదిత వ్యాధుల కోసం మాత్రమే మూలకణ చికిత్స అందించాలి. ఆటిజానికి మూలకణ చికిత్స అందించవద్దని, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయన్న శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 30న కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పును అనుసరించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ ఈ నెల 10న ఎన్‌ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజిత్ సేథ్‌కు లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..